బుగ్గారం జెడ్పిటీసి బాదినేని రాజేందర్, ఎంపీపీ రాజమణి .బి అర్ స్ కు రాజీనామా

కాంగ్రెస్ లో చేరే యత్నం

On
బుగ్గారం జెడ్పిటీసి బాదినేని రాజేందర్, ఎంపీపీ రాజమణి .బి అర్ స్ కు రాజీనామా

బుగ్గారం జెడ్పిటీసి బాదినేని రాజేందర్, ఎంపీపీ రాజమణి బియరెన్ కు రాజీనామా - కాంగ్రెస్ లో చేరే యత్నం

జగిత్యాల మే 02 :

ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం జెడ్పిటీసి బాదినేని రాజేందర్, ఎంపీపీ రాజమణి బీఆర్ఎస్ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెరాస పార్టీ ప్రారంభం నుండి కెసిఅర్ గెలవాలని, తెలంగాణ వాదం నిలవాలని బీఆర్ఎస్ పార్టీ కోసం మేము ఎంతో కృషి చేశాం. తెలంగాణ సాధనలో కూడా భాగస్వామ్యం అయ్యాము.పార్టీ పిలుపు మేరకు అన్ని రకాల సేవలు చేశాము

కానీ పార్టీ మమ్ములను అణిచివేతకు గురి చేసి చిన్న చూపు చూసింది, కొప్పుల ఈశ్వర్ కు ఎంతో సపోర్ట్ చేసి ఆయన గెలుపు కోసం కృషి చేశాము. ఆయన కూడా మమ్మల్ని చిన్న చూపు చూసినట్లు అనిపించింది. పార్టీని వీడుతుంటే  చాలా భాదగా ఉంది 

ప్రజల కోరిక మేరకు, మా కార్యకర్తల కోరిక మేరకు పార్టీ కి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము.త్వరలో మా భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తాం..

గతంలో బీసీ నాయకునిగా ఎన్నికల్లో పోటీకి యత్నం ?

గత ఎన్నికల సమయంలో కూడా రాజేందర్ కొన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. బీజేపీ లో చేరి గత 2 ఎన్నికల్లో జగిత్యాల నుండి బీసీ నాయకునిగా పోటీచేయాలని ప్రయత్నించారు. 

మున్నూరు కాపు వర్గానికి చెందిన రాజేందర్ కుల సంఘంపేట అనేక కార్యక్రమాలు నిర్వహించి, జిల్లా స్థాయి నాయకునిగా ఎదిగే ప్రయత్నం చేసారు. 

బి అర్ స్ పార్టీకి రాజీనామా చేసిన రాజేందర్, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని అనుకొంటున్నారు.

Tags