లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత.

- క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్.

On
లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే 10( ప్రజా మంటలు )

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ పేర్కొన్నారు.

శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ...

జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని జిల్లా ఎస్పి తెలిపారు.

తద్వారా జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నాం.శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 2247 మంది జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ,ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికరితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, 97 రూట్ మొబైల్స్, 20 క్విక్ రియాక్షన్ టీమ్స్ ( క్యూ ఆర్ టీ)/ స్ట్రయికింగ్ ఫోర్స్/ స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్/ , కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ హోమ్ గార్డ్స్ -800 మంది, సి ఐడి- పోలీస్- అంతే కాకుండా పోలింగ్ స్టేషన్లో ఎన్ సి సి / ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ కూడా ఉపయోగిస్తామని అన్నారు.

  1. జిల్లా లోని పోలింగ్ కేంద్రాల వివరాలు :
  • జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషను లు 927,
  • సాధారణ పోలింగ్ స్టేషన్లు 807,
  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 120.

జిల్లా వ్యాప్తంగా 8,19,838 మంది ఓటర్లు ఉన్నారని ఇందులో పురుషులు 3,92,257 మంది, మహిళ లు 4,27,546 మంది, ట్రాన్స్ జెండర్స్ 35 మంది ఉన్నారని అన్నారు.  

  1. స్వాధీన పరుచుకున్న వివరాలు :

ఇప్పటివరకు స్వాధీనపరచుకున్న నగదు 2,21,53,310 /- రూపాయలు.

లిక్కర్ లీటర్ల లో 2769 సుమారుగా అంచనా విలువ 14,43,015/- రూపాయలు.

ఇతర సామాగ్రి: సుమారుగా అంచన విలువ 67,45,011 /- రూపాయలు.

గోల్డ్:1.506 కె జి లు సుమారుగా అంచన విలువ 90,00,000 /- రూపాయలు.

గంజాయీ: 15.81 కె జి లు సుమారుగా అంచన విలువ 3,95,000/- రూపాయలు.

*సీజ్ చేసినా నగదు, లిక్కర్, గంజా గోల్డ్, ఇతర వస్తువుల విలువ మొత్తం విలువ 3,97,36 ,336 /- రూపాయలు*

*జిల్లాలో ఇప్పటివరకు బైండోవర్ చేయబడిన వ్యక్తులు 612.* 

గతంలో ఎలక్ట్రోరల్ నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను మరియు అందులో సహకరించిన వ్యక్తులను బైండోవర్ చేయడమైనదని, రౌడీ షీట్ కలిగిన వారిని కూడా ముందస్తుగా బైండోవర్ చేయడం జరిగింది.

246 ఎన్ బి డబ్లు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అన్నారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘనాలపై కఠినంగా ఉన్నామన్నారు.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు జిలాల్లో ఎన్నికల నియామావళి ఉల్లంఘన కేసులు 06 నమోదు కావడం జరుగుతుందన్నారు.

*లైసెన్సుడు ఆయుధముల డిపాజిట్:* ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియామవళి అనుసారంగా లైసెన్సు కలిగిన ఆయుధములు అన్నియు డిపాజిట్ కొరకు అండర్ సెక్షన్ 144 .సి ఆర్. పి సి అనుసరించి నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది , ఇప్పటికే జిల్లా లో ఉన్న మొత్తం 45 ఆయుధములు డిపాజిట్ కాబడినవి.

ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన వారు స్థానికంగా ఎవరు ఉందరాదని, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, హోటళ్ళలో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు, రాజకీయ పార్టీల వారు ఉండకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.   

జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పి గారు కోరారు.

ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Tags