కోరుట్ల రూరల్ సెక్షన్ పరిధిలో విద్యుత్ నిర్వహణపై తనిఖీ చేసిన ఎస్.ఈ. జి. సత్యనారాయణ.

On
 కోరుట్ల రూరల్ సెక్షన్ పరిధిలో విద్యుత్ నిర్వహణపై తనిఖీ చేసిన ఎస్.ఈ. జి. సత్యనారాయణ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

కోరుట్ల మే 10 (ప్రజా మంటలు) : 

శుక్రవారం జి. సత్యనారాయణ, ఎస్ ఈ, జగిత్యాల జిల్లా, కోరుట్ల రూరల్ సెక్షన్ పరిధిలోని, 33/11 కే వి సబ్ స్టేషన్,వెంకటాపూర్ లో ఏప్రిల్ నెలలో కరెంట్ ట్రిప్ అంతరాయాలు ఎక్కువగా అవుతున్నందుకు గాను తనిఖీ చేసారు. అలాగే,

  • లాగ్ బుక్ మరియు వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ల లోని రిలే ల లోని అంతరాయము వివరాలను పరిశీలించి, సబ్ స్టేషన్ పరిధిలోని వినియోగదారులకు ఎన్ని సార్లు, ఎంత సమయం, అంతరాయాలు ఏర్పడ్డాయని పరిశీలించారు.
  • సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని లైన్ లు పరిశీలించి,అవసరమైన చోట, లూస్ లైన్ లు ఉన్న చోట మిడిల్ పోల్ లు వెంటనే ఏర్పాటు చేసి, వినియోగదారులకు నిరంతరాయముగా విద్యుత్ ను అందించాలని ఆదేశించారు.
  • వెంకటాపూర్ సబ్ స్టేషన్ లో 3 ఫీడర్ లకు, ఒకే బ్రేకర్ ఉన్నందున ,కలిగే అంతరాయము లను తగ్గించడానికి అదనపు బ్రేకర్ ఏర్పాటు కు అంచనాలు వెంటనే పంపించాలని ఏ ఈ ని అదేశించారు.
  • ఈ వేసవి కాలం లో లోడ్ పెరుగుచున్నందున తగు చర్యలు తీసుకొని వినియోగదారులందరికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. 

ఈ తనిఖీలో  నగేష్ కుమార్-ఏ డి ఈ, టెక్నికల్, ఆంజనేయ రావు- ఏ డి ఈ / కోరుట్ల, శ్రీనివాస్- ఏ ఈ, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు...

Tags