లోకసభ ఎన్నికలకు సంబంధించి...సోమవారం పోలింగ్ కు మొదలైన పోలింగ్ సామగ్రి పంపిణీ.

- పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా.

On
లోకసభ ఎన్నికలకు సంబంధించి...సోమవారం  పోలింగ్ కు మొదలైన పోలింగ్ సామగ్రి పంపిణీ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే 12 ( ప్రజా మంటలు ) : 

జిల్లాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సామగ్రి, ఓటింగ్ యంత్రాల పంపిణీ ప్రక్రియ మొదలైంది.

ఇందుకుగాను జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా నేతృత్వంలో సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం.

సోమవారం నాటి పోలింగ్ ప్రక్రియకు ముందురోజు ప్రక్రియను ఆదివారం ఉదయం 7 గంటలనుండే ప్రారంభించారు.

మధ్యాహ్నం నుండి పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్ళాయి.

జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవ ర్గానికి ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలుఏర్పాటు చేసారు.

ఓటింగ్ యంత్రాలు, సిబ్బందిని తరలించేందుకు 295 వాహనాలు సిద్ధం చేశారు. అందులో సెక్టార్ అధికారులకు 80 కార్లు, పోలింగ్ సిబ్బంది తరలించేందుకు 85 బస్సులు, 139 మినీ బస్సులు, 22 ఇతర వాహనాలున్నాయి.

పోలింగ్ అనంతరం ఓటింగ్ యంత్రాలు తరలించేందుకు 7 కంటేనర్లను సిద్ధంగా ఉంచారు.

  • జిల్లాలో ఎన్నికల విధుల్లో 1104 మంది పోలింగ్ అధికారులు,
  • 1104 సహాయ పోలింగ్ అధికారులు,
  • 2208 మంది ఇతర సిబ్బంది,
  • 116 మంది మైక్రో అజ్జర్వర్లు పాల్గొంటున్నారు.

నియోజకవర్గాల వారీగా....

  • కోరుట్లలో 1261,
  • జగిత్యాలలో 1227,
  • ధర్మపురి 1014,

చొప్పదండి పంపిణీ నియోజకవర్గంలోని

  • మల్యాల, కొడిమ్యాల మండలాల్లో 517 మంది,

వేములవాడ నియోజకవర్గంలోని

  • మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో 431 మంది

అధికారులు, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.

ధర్మపురి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జగిత్యాల కేంద్రంలో ఆర్డీవో పి. మధుసూదన్, కోరుట్ల నియోజకవర్గంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్ లు పర్యవేక్షణ గావిస్తున్నారు.

జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష జగిత్యాల పంపిణీ కేంద్రం వద్ద అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు, సిబ్బంది కలిసి తరలివెళ్లే వాహనాలను పర్యవేక్షణ చేశారు.

ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags