జగిత్యాల పట్టణ గాంధీనగర్ ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం.

On
జగిత్యాల పట్టణ గాంధీనగర్ ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల మీ 14 (ప్రజా మంటలు)

జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ ఆరోగ్య కేంద్రం లో ప్రతి మంగళ వారము ఆరోగ్య మహిళ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగా, స్త్రీ సంబంధిత ప్రత్యేక చికిత్స, అంకాలజిస్ట్ కన్సల్టేషన్, వి ఐ ఎ,క్యాన్సర్ ట్రీట్ మెంట్, అల్ట్రా సౌండ్,మేమో గ్రామ్,పెప్సీమియం, తదితర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి మంగళ వారం "ఆరోగ్య మహిళ" దినంగా పరిగనిస్తామని,జిల్లా ఉప వైద్యాధికారి డా. జైపాల్ రెడ్డి, స్త్రీ వైద్య నిపుణులు డా. చైతన్య రాణి తెలిపారు.

ఈకార్య క్రమములో, హాస్పిటల్ సిబ్బంది,టెక్నీషియన్స్,సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Tags