ఇచ్చిన గ్యారంటీ హామీలను అమలు చేసి తీరుతాం ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

On
ఇచ్చిన గ్యారంటీ హామీలను అమలు చేసి తీరుతాం ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇచ్చిన గ్యారంటీ హామీలను అమలు చేసి తీరుతాం
ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి : అడ్లూరి లక్ష్మణ్ కుమార్
బుగ్గారం కాంగ్రెస్ సభ కు తరలి వచ్చిన మహిళా లోకం
(చుక్క విశాల్)

 

బుగ్గారం మే 11 (ప్రజా మంటలు) :

గడ్డం వంశీకృష్ణ ను పెద్దపెల్లి పార్లమెంటు ఎంపి గా భారీ మెజారిటీతో గెలిపించాలని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని, ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల ఋణ మాఫీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసి తీరుతుందని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభకు మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ఈ సభకు హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలు ఏమున్నా విడతల వారీగా పరిష్కరించే బాధ్యత మాదీ అని అడ్లూరి హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల సుభాష్ తో పాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

------

Tags