పది రాష్ట్రాల్లో ముగిసిన నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ - పూర్తి ప్రశాంతం

On
పది రాష్ట్రాల్లో ముగిసిన నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ - పూర్తి ప్రశాంతం

పది రాష్ట్రాల్లో ముగిసిన నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ - పూర్తి ప్రశాంతం

96 లోక్ సభ స్థానాలకు 1717 మంది అభ్యర్థుల పోటీ

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 525 మంది పోటీ

204 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికల నిర్వహణ

ఇక జూన్ 4న బయట పడనున్న అభ్యర్థుల భవితవ్యం


(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ - 99481 33539)

జగిత్యాల మే 13: 
నాలుగవ విడత పది రాష్ట్రాల్లోని 96 లోకసభ స్థానాల ఎన్నికలు సోమవారం ముగిశాయి. వాటితో పాటు మూడు రాష్ట్రాల్లోని 204 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు నిర్వహించారు.
ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా 10 రాష్ట్రాల్లోని మొత్తం 96 లోక్ సభ స్థానాలకు గాను 1717 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం అయిన జమ్ము కాశ్మీర్ లో ఒక లోక్ సభ స్థానం, ఆంధ్ర ప్రదేశ్ లో - 25, తెలంగాణలో - 17, ఉత్తర ప్రదేశ్ లో - 13, మహా రాష్ట్ర లో - 11, మధ్య ప్రదేశ్ లో - 8, పశ్చిమ బెంగాల్ లో - 8, బీహార్ లో - 5, ఒడిస్సా లో - 4, ఝార్ఖండ్ లో - 4, మొత్తం : 96 లోక్ సభ స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. వీటితో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని - 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిస్సా లోని - 28 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణ లోని సికింద్రాబాద్ కంటోన్ మెంట్ లోని ఒక అసెంబ్లీ స్థానానికి కూడా సోమవారం ఎన్నికలు జరిగాయి.

తెలంగాణ రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జూన్ 4 ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి. అప్పటి దాకా అభ్యర్థులతో పాటు, ఓటర్లు కూడా ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.....

కాగా ఇట్టి ఎన్నికల్లో అక్కడక్కడ చెదురు - మొధురు సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల అల్లర్లు జరిగాయి.

Tags