ఉపాధ్యాయుల పై లాఠీ చార్జీ చేయించిన అర్డీఓ పై చర్యలు తీసుకోవాలి- పి.ఆర్.టి.యూ డిమాండ్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 14 (ప్రజా మంటలు )
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్లో సజావుగా పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వ హించిన ఉపాద్యాయులు, ఎన్నికల నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన 5 రోజుల భత్యం ఇవ్వాలని నియోజక వర్గ ఎన్నికల అధికారి అయిన స్థానిక ఆర్డీవోని కోరడం జరిగిందని, అలాగే సిద్దిపేట, గజ్వేల్ తదితర ప్రాంతాలలో 5 రోజులు చెల్లించిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఏకరీతిగా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులపై అసహనంతో పోలీసులతో లాఠీ చార్జి చేయించడాన్ని పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాళ్ల అమర్ నాధ్ రెడ్డి ,ఆనంద్ రావు లు తీవ్రంగా ఖండించారు.
న్యాయంగా తమకు రావాల్సిన వేతన బత్యాలను ఇవ్వాలని అడిగిన వారిపై పోలీసుతో బలప్రయోగం చేయడం అత్యంత దారుణం అని పత్రిక ప్రకటన విడుదల చేసారు.
ఉపాధ్యాయులు ఎన్నికల విధుల పట్ల ఎంతో అంకిత భావం తో పనిచేస్తారని పొగిడిన అధికారులే, పనులు ముగించు కున్నాక సరియైన రెమ్యునరేషన్ ఇవ్వకుండా పోలీసులతో లాఠీ చార్జీ చేయడం అత్యంత బాధకరం అని నిబంధనల ప్రకారం 5 రోజుల రెమ్యునరేషన్ చెల్లించ కుండా ఈ ఘటనకు కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు ని పత్రికప్రకటన ద్వారా కోరారుఅలాగే రాష్ట్ర వ్యాపితంగా ఒకేరకమైన రెమ్యునరేషన్ చెల్లించాలని విజ్ఞప్తి చేసారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
