అభివృద్ధి సంక్షేమమే బిజెపి ఎజెండా.

రాయికల్ మండలంలో పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన డా. బోగ శ్రావణి ప్రవీణ్

On
అభివృద్ధి సంక్షేమమే బిజెపి ఎజెండా.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

రాయికల్ మే 10 ( ప్రజా మంటలు ) : 

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయికల్ మండలం భూపతిపూర్, ఇటిక్యాల్ గ్రామాలలో బిజెపి ఎంపీ అభ్యర్థి శ్రీ ధర్మపురి అరవింద్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా.బోగ శ్రావణి.

ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...

కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు ఎజెండా కరువైందని, ప్రజల్లోకి వెళ్లి ఏ విధంగా ఓట్లు అడగాలో కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడమే బిజెపి ప్రధాన ఎజెండాగా నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు.

దేశంలో మరోసారి మోడీ చరిష్మాతో 400 సీట్లు గెలవడం ఖాయమన్నారు, బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సి ఏ ఏ మరియు ఎన్ ఆర్ సి వంటి చట్టాలను అమలు చేసి తీరుతుందన్నారు.

నిజాంబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గతంలో ఏనాడు లేని విధంగా నిజాంబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కేంద్ర ప్రభుత్వం నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతుల చిరకాల స్వప్నం నెరవేర్చిన వారయ్యారని గుర్తు చేశారు.

ప్రజలు మరోసారి భారత ప్రధానిగా మోడీ ని ఆశీర్వదిస్తారని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరోసారి కాషాయ జెండా ఎగురవేసి ధర్మపురి అరవింద్ అన్న గారిని రెండోసారి ఎంపీగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాయికల్ మండల అధ్యక్షులు అన్నవేని వేణు, ప్యాక్స్ చైర్మన్ ముత్యం రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ మహిపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తీపి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంగళారపు లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కుంటల రమేష్ రెడ్డి బూత్ అధ్యక్షులు మరియు మండల పదాధికారులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags