ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్.
- ప్రశాంత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 11 ( ప్రజా మంటలు )
శనివారం జిల్లా కేంద్రంలో 300 మంది జిల్లా పోలీస్, కేంద్ర బలగాలతో కలసి ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతును జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంబించారు. ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ మంచి నీళ్ళ బావి నుండి తీన్ ఖని,టవర్ సర్కిల్, న్యూ బస్ స్టాండ్ ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఈ నెల 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ నకు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఎస్పీ తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని అన్నారు.
ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో 10 ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించడం జరిగిందని అన్నారు.
జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జిల్లా కి రావడం జరిగింది అని అన్నారు. మద్యం,నగదు మరియు ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఫ్లాగ్ మార్చ్ లో అడిషనల్ ఎస్పీ లు వినోద్ కుమార్, భీం రావ్, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, డిఎస్పీలు రవీంద్ర కుమార్,రఘు చందర్, ఇన్స్పెక్టర్లు వేణుగోపాల్, ఆరిఫ్ అలీ, రవి , రామ్ నరసింహారెడ్డి ఖాన్ , ఆర్.ఐ లు వేణు ,రామకృష్ణ ,జనిమియా మరియు ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
