ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

On
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 99649493/9348422113).

గొల్లపెల్లి మే 10(ప్రజా మంటలు )

రైతులు పండించిన వరి ధాన్యం ను త్వరగా తూకం వేసి మిల్లులకు పంపించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు.

శుక్రవారం రోజున గొల్లపల్లి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలోని రాపల్లి, ఇబ్రహీంనగర్ (శ్రీరాములపల్లి) లలొని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.... ధాన్యం కేంద్రాలకు వచ్చిన వరి పంటను తొందరగా కాంటా వేసి మిల్లులకు తరలించాలని అన్నారు.

అకాల వర్షాల వలన పంట తడిసిపోతుంది అని, ఆయా కేంద్రాల నుండి ధాన్యం తరలించాలని అన్నారు. ఎప్పటికప్పుడు ట్యాబ్ రికార్డులలో ఎంట్రీ నమోదు చేయాలని అన్నారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

Tags