సాధన ద్వారానే సకల సమస్యల పరిష్కారం - సద్గురు అనిల్ కుమార్ జ్యోషి స్వామీజీ
సాధన ద్వారానే సకల సమస్యల పరిష్కారం - సద్గురు అనిల్ కుమార్ జ్యోషి స్వామీజీ
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి మే 10 (ప్రజా మంటలు) : ప్రపంచంలో అనితర సాధ్యాలు ఏవీ ఉండవని, సాధనల ద్వారా సర్వ సమస్యలు పరిష్కారం కాగలవని హైదరాబాద్ శ్రీనిఖిల్ చేతనా కేంద్ర వ్యవస్థాపకులు, నిర్వాహకులు సద్గురు అనిల్ కుమార్ జ్యోషి స్వామీజీ ఉద్ఘాటించారు. సుప్రసిద్ధ ప్రాచీన ధర్మపురి పుణ్యక్షేత్రంలో శేషు శర్మ మార్గదర్శకత్వంలో, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన 108మంది శిష్య బృందంతో శుక్ర వారం అక్షయ తృతీయ సందర్భంగా నిర్వహించిన లక్ష్మీ నరసింహ మూల మంత్ర జప హవన కార్యక్రమ నిర్వహణ సందర్భంగా అనిల్ కుమార్ జ్యోషి మాట్లాడుతూ, నారసింహ మూల మంత్ర జపాలు పూర్తి చేయడం జరిగిందని, దానికి ముగింపుగా ఏటా నిర్వహిస్తున్న క్రమంలో ధర్మపురి నారసింహ సన్నిధిలో దశాంశ పద్ధతిన మూలమంత్ర హవన కార్యక్రమం జరుపుతున్నా మన్నారు. ఉదయం దేవస్థానంలో కలశ, గణ పతి పూజతో ప్రారంభించి, మాతృక, స్వస్తి, పుణ్యాహవాచనం, సర్వతోభద్ర మండల పూజ, శ్రీ లక్ష్మీ నరసింహ స్థాపన, పూజాదికాలు, హోమాదులు, సాయంత్రం పొన్నచెట్టు సేవాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మే 13నుండి బోధన్ లో నూతన నిర్మిత నిఖిల్గాం నందు నార సింహ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
లక్ష్మీ నరసింహ మూల మంత్ర హవనం
శుక్ర వారం అక్షయ తృతీయ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ శ్రీనిఖిల్ చేతనా కేంద్ర వ్యవస్థాపకులు అనిల్ కుమార్ జ్యోషి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో, లక్ష్మీ నారసింహ మూలమంత్ర హవన కార్యక్రమం నిర్వహించారు. రావులపెల్లి శేషు శర్మ ఆధ్వర్యంలో, దశాంశ పద్దతిన మహామంత్ర జప హవనాది కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్వామీజీ శిష్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)