విద్యుత్ ఫీడర్లు నిర్వహణలో భాగంగా విద్యుత్ సరఫరా అంతరాయం.

On
విద్యుత్ ఫీడర్లు నిర్వహణలో భాగంగా విద్యుత్ సరఫరా అంతరాయం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

మెట్ పల్లి  మే 15 ( ప్రజా మంటలు ) : 

ఋతుపవనాలు ప్రవేశిస్తున్న దృష్ట్యా ముందస్తు విద్యుత్ ఫీడర్లు నిర్వహణలో భాగంగా మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో వివిధ 33కెవి ఫీడర్లకు విద్యుత్ సరఫరా లో అంతరయాలు ఉంటాయని మెట్పల్లి ఏడిఈ మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

రాబోయే వర్షాకాలంలో నిరంతర విద్యుత్ సరఫరా కొరకు మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో గల వివిధ 33 కెవి లైన్ ల కింద పెరిగిన చెట్ల కొమ్మలు తొలగించడానికి మరియు వంగిన స్తంభాలు, వేలాడే లైన్లు సరిచేయడానికి, తెగిన స్టే వైరు సరిదిద్దడానికి

  • ఈనెల17న జగ్గసాగర్, వెల్లుల్ల సబ్ స్టేషన్లు,
  • 18న కోనరావుపేట వేంపేట, చెవులమద్ది, మెట్పల్లి టౌన్,
  • 19న ఆత్మకూర్,
  • 20న మేడిపల్లి పడమర, వెంకటరావుపేట, బండలింగాపూర్, మెట్లచిట్టాపూర్, అమ్మక్కపేట, డబ్బా వాటర్ గ్రిడ్ సబ్ స్టేషన్ లకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడనున్నది.

కావున వినియోగదారులు సహకరించవలసిందిగా ఏడిఈ మనోహర్ కోరారు.

Tags