డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ సహాయక కేంద్రం ఏర్పాటు.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 16 ( ప్రజా మంటలు )
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్షలు పాసైన విద్యార్ధినీ, విద్యార్థులందరూ డిగ్రీలో ప్రవేశాల కొరకై దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా దోస్త్ అడ్మిషన్ల కో ఆర్డినేటర్ డాక్టర్ అరిగెల అశోక్, ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాలోని విద్యార్థులందరూ ఈ సహాయక కేంద్ర వసతిని వినియోగించుకొని, ఎలాంటి సాంకేతిక సమస్యలు గానీ, ఇతర సమస్యలు గానీ తలెత్తినట్లైతే 98484 15835 (ప్రిన్సిపాల్), 98855 88419 (అకాడమిక్ కో ఆర్డినేటర్, ఎన్ సందీప్), 99632 87177 (టెక్నికల్ అసిస్టెంట్, గణేష్ ) లను సంప్రదించగలరని పేర్కొన్నారు.
మొదటి విడత వెబ్ ఆప్షన్లు మే 20 నుండి ప్రారంభమవుతాయని, మొదటి విడత సీట్ల కేటాయింపు వివిధ కళాశాలలకు జూన్ 6న ఉంటుందని, తర్వాత రెండవ విడత సీట్ల కేటాయింపు జూన్ 6 నుండి, మూడవ విడత జూన్ 19 నుండి ఉంటాయని, జూలై 8వ తేదీ నుండి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
కావున విద్యార్థులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
