రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం..
మద్దతు ధరకు అదనంగా రు.500 బోనస్ ఇస్తాం..
విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి..
జగిత్యాల మే 17:
ధాన్యం తూకంలో కోత లేకుండా సేకరిస్తున్నాం. రైతులను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.
విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపికి అమ్ముడు పోయింది. గెలిచినా..ఓడినా..చరిత్రలో నిలుస్తా.బీ అర్ ఎస్ పాలనలో వరి వేస్తే ఉరి.. కేవలం సన్న రకాలు సాగు. చేయాలి....ధాన్యం కొనుగోలు చేయం అని తూములు కూడా బందు చేసిండ్రు అని అన్నారు.
ఇంకా, ఐదేళ్లు పూర్తి అయిన పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయలేదు.కెసిఆర్ సన్నరకాలు సాగుచేస్తే ఏవిధమైన ప్రోత్సాహం ఇవ్వలేదు.ఏక మొత్తంగా ఇవ్వాల్సిన రుణ మాఫీ విడతల వారీగా అమలు చేసింద్రు.
ఇప్పుడు రైతులకు బోనస్ ఇవ్వాలని బీ అర్ ఎస్ నాయకులు రైతు దీక్ష చేపట్టడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది..రసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి.డీజిల్ ధరలు పెరిగినాయి.
పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా క్వింటాల్ కు 3000 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది.
యూ పీ ఏ పాలనలో 2004 లో ధాన్యం క్వింటాల్ కు రు.450 మద్దతు ధర 2014 వరకు రు.1350 మూడింతలు పెరిగింది.
ఎన్ డీ ఏ పదేళ్ల పాలనలో కేవలం 1350 నుండి రు.2,200 పెంచింది. స్వామి నాథన్ సిఫార్సులు పరిగణలోకి తీసుకోవడం లేదు.
రైతులకు మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులకు అండగా నిలువాలని రు.500 బోనస్ ప్రకటిస్తే ఎట్లా ఇస్తారు అని విమర్షిస్తున్నరు.
పీ డీ ఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా, రీ సైక్లింగ్ అరికట్టబడాలి.మొదటి విడతగా రైతుకు కూడా సన్నరకాల సాగు కు బోనస్ అందిస్తాం.
సన్న రకాల సాగు ఖరీఫ్ లోనే చేస్తారు.. ఈ విషయం కెసిఆర్ కు తెలుసో తెలియదో.. అందరూ 500 బోనస్ అమలు సాధ్యమా అని అనుకున్నారు.
బోనస్ అమలు కు చర్యలు చేపడుతున్నాం.
ఖరీఫ్ పంట నాటికి రెండు లక్షలు రుణ మాజీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డీ నిర్మాణాత్మకంగా కార్యాచరణ రూపొందించి, చర్యలు చేపడుతున్నం.
రైతులకు అండగా నిల్చెందుకు రైతు భరోసా అమలు చేసినం.రుణ మాఫీ చేయబోతున్నాం. ప్రభుత్వం అప్పు తీసుకు వచ్చి అయినా రుణ మాఫీ చేస్తుంది.
బీ అర్ ఎస్ రైతులకు బోనస్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. ఐదేళ్ల లో పూర్తి స్థాయిలో రుణ మాఫీ. చేయలేదు. గతంలో క్వింటాల్ కు 10 కిలోలు అదనపు తూకం వెసిండ్రు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కోత లేకుండా సేకరిస్తోంది.ఈ ఏడాది అదనంగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినం.
కల్లాల వద్ద ఇబ్బందులు లేకుండా
తడిసిన సేకరించెలా, రైతులు ఆందోళన పడకుండా చర్యలు చేపడుతున్నాం.
రైతులకు అండగా నిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును బీ అర్ ఎస్ జీర్ణించుకోలేక, ఉనికి కాపాడుకోవాలని దీక్షలు చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి.
డెడ్ స్టోరోజి నుండి కుండా నీరు విడుదల చేసి పంటలను కాపాడినం.విద్యుత్ గతేడాది కన్న ఏడాది 50 శాతం అదనంగా వినియోగం ఉన్నది.
ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అండగా నిలిచెందుకు క్వింటాల్ కు మద్దతు ధర రు.3000 ఇస్తాం.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కోట్లాది మంది కి ఉపాధి కల్పిస్తున్నది. ఆహార భద్రత చట్టం విద్యా హక్కు చట్టం.. పాలనలో పారదర్శక త కోసం.సమాచార హక్కు చట్టం తీసుకు వచ్చినం.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బిజెపి కి కుదువ బెట్టిండ్రు.కాంగ్రెస్ ను గెలువకుండ అడ్డకునెందుకు బీ అర్ ఎస్ పార్టీ, బిజెపి కి అమ్ముడు పోయింది. పదేళ్లలో బిజెపి ప్రజల కోసం ఎం పథకాలు ప్రవేశ పెట్టింది.. ..బిజెపి కి ప్రజలకు ఎట్లా సేవ చేయాలనే ఆలోచన లేదు..
బిజెపి కి సిద్దాంతం ఉన్నదా..?
కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయం చేయడం మినహా.. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తుందా.. బోనస్ ఇస్తుందా.. ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నదా..అని జీవన్ రెడ్డీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం తో పని చేస్తుంది.దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్.భారతదేశ అభివృద్ధికి బాటలు వేసింది కాంగ్రెస్ అని ఉద్ఘాటించారు.
రాజకీయంగా జన్మనిచ్చిన జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే తపనతో నిజామాబాద్ నుండి పోటీ చేసిన.నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని తెలిసి కూడా పోటీ చేసిన, గెలిస్తే అర్జునుడిని అవుతా..ఓడితే అభిమన్యుడిని అవుతా..గెలిచినా..గెలువకపోయిన చరిత్రలో నిలిచిపోతా..అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు కల్పించిన మంత్రికి ధన్యవాదాలు
కాగజ్నగర్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు తప్పనిసరిగా అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కఠిన ఆదేశాలు జారీ చేసిన విషయం సీనియర్ సిటిజెన్స్లో హర్షాన్ని కలిగించింది.
సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్త... న్యూ అశోక్ నగర్లో కార్తీక దీపోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ పార్సిగుట్టలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం కార్తీక మాసం చివరి రోజున బీజేపీ సీనియర్ మహిళా నేత మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె,... చిలకలగూడ పోలీసులకు శిక్షణ :ముగిసిన రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి, సిటీ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు చిలకలగూడ డివిజన్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు గురువారం రెండో రోజూ కొనసాగాయి. పోలీస్ సిబ్బందికి ఫైనాన్షియల్, సెల్ఫ్ డిసిప్లిన్, తదితర అంశాలపై ఎస్బీఐ చీఫ్ మేనేజర్ టీ.టీ. లిజేశ్, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంపై న్యూ... బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ ఆర్ భూమి సమస్య, కు మద్దతుగా ఉద్యమం - కవిత
మియాపూర్/ షాద్ నగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు) :
రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు బస్తీలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, ప్రభుత్వంపై స్పందన తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శేరిలింగంపల్లి... హైదరాబాద్‌లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
భారత సరకు రవాణా రంగం భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని, దానికి అనుగుణంగా ఆధునిక నైపుణ్య శక్తి అవసరమని కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌధరి తెలిపారు. హైదరాబాద్ ఎన్ఎస్టీఐ క్యాంపస్లో ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్... వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన సదస్సు.
మెట్టుపల్లి నవంబర్ 20(ప్రజా మంటలు దగ్గుల అశోక్)
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో మెట్టుపల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామపంచాయతీ ఆవరణలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగo నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్ బాల్య
.... కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం
రూ.పది లక్షల ఆపరేషన్ గాంధీలో ఉచితం...
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. చెవి-ముక్కు-గొంతు విభాగం ఆధ్వర్యంలో జీరో నుంచి ఐదేళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ సేవలను అందిస్తున్నారు. ఈమేరకు గాంధీలో తొలిరోజు గురువారం... మల్లాపూర్లో విఏఓ పై కాంగ్రెస్ నాయకుల అరాచకం – సరిత నిరాహార దీక్ష
మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో విఏఓగా విధులు నిర్వర్తిస్తున్న బలహీన వర్గాల మహిళ ఎనుగంటి సరితను లక్ష్యంగా చేసుకుని గ్రామ కాంగ్రెస్ నాయకులు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార దుర్వినియోగంతో ఉద్యోగం నుంచి తొలగించి, ఆర్డర్ కాపీ ఇచ్చినప్పటికీ తిరిగి విధుల్లోకి అనుమతించకపోవడంతో సరిత తీవ్ర... ఆత్మ నిర్భర్ పథక లక్ష్యసాధనకు కృషి చేయాలి
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు)ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్బర్ పథకం అమలు పై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశము స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర పథకం అమలు, మరియు లక్ష్య సాధనకై... తెలంగాణ బీజేపిలో విభేధాలు లేవు: ఈటల రాజేందర్
కరీంనగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేధాలు లేవని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నది అసత్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పర్యటన అనంతరం కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
“ఏ పార్టీ లోనైనా విభేదాలు సహజమే. కానీ... దళిత యువకుడి కస్టోడియల్ డెత్పై కఠిన చర్యలు తీసుకోవాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
సుర్యాపేటలో కర్ల రాజేశ్ అనే దళిత యువకుడు కస్టడీలో జరిగిన అనుమానాస్పద మరణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోలీసుల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కవిత ఈ ఘటనపై స్పందిస్తూ,“దళిత బిడ్డను పోలీసులు నిర్దాక్ష్యణంగా... అరుదైన ఆపరేషన్ చేసి బాలుడికి పునర్జన్మ ఇచ్చిన గాంధీ వైద్యులు
కిలో కు పైగా బరువు ఉన్న ప్లీహం తొలగింపు
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా 7 ఏళ్ల బాలుడికి ల్యాపరోస్కోపిక్ విధానంలో ప్లీహము తొలగించే శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్,హెచ్ఓడీ డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. మంచిర్యాల జిల్లా అకినేపల్లి... 