నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి? తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు ?

On
నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి?  తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు ?

నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి?

తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు ?

గతంలో గెలిచిన 42 సీట్లు నిలబెట్టుకోలేని బిజేపి

కూటమిలో లేని ప్రాంతీయ పార్టీల మాటనే నెగ్గుతుందా ?

ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో బిజేపి అనుకొన్న, ఉన్న స్థానాలను కూడా దక్కించుకోలేదని, తప్పని సరిగా ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సి వస్తుందని, అసమయంలో వాటి గొంతెమ్మకోర్కెలను ఆమోదించక తప్పని స్థితిలో ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. బిజేపి గత ఎన్నికల్లో గెలిచిన 303 సీట్లలో కనీసం 125 సీతాలను కోల్పోతుందని, ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఇంఠ వరకు 380 సీట్లకు జరిగిన పోలింగ్ లో దక్షిణ భారతంలోని 5 రాష్ట్రాలలోని 130 సీట్లలో బిజేపి కనీసం 25 సీట్లు కూడా గెలవలేకపోతుంది.  

(సిహెచ్ వి ప్రభాకర్ రావు)

హైదరాబాద్ మె 15:

నాల్గవ దశ ఎన్నికలు పూర్తయిన తరువాత పోసింగ్ సరళిని పరిశీలించిన విశ్లేషకులు, ఈ దశలో బిజేపికి అనుకున్నన్ని సీట్లు రావడం సాధ్యంకాదనే అంచనాకు వచ్చారు. పది రాష్ట్రాలలో, 96 పార్లమెంట్ స్థానాలలో జరిగిన ఎన్నికల్లో గతంలో 42 స్థానాలను గెలుచుకొన్న బిజేపి, ఈసారి తన సీట్లను నిలుపుకోవడానికి తీవరపయత్నాలే చేసింది. బిజేపి మళ్ళీ అధికారంలోకి రావడానికి స్వంతంగా కానీ ఎన్ ది ఏ కూటమి కూడా, అధికారంలోకి రావడానికి కావాల్సిన 272 సీట్లు రావడామే కష్టమనే వార్తలు వస్తున్నాయి. ఈదశలో ఏ కూటమిలో లేని పార్టీలు గెలిచే సీట్లతో పాటు, తెలుగు రాష్ట్రాలలోని టిడిపి, వై ఎస్ ఆర్ సి పి లతో పాటు, తెలంగాణలో బి ఆర్ ఎస్ గెలిచే సీట్లు కూడా ప్రధానం కానున్నాయి.

ఎప్పుడు బిజేపికి మద్దతు ప్రకటిస్తు, స్వతంత్రంగా వ్యవహరించే ఒరిస్సా లోని బిజూ జనతాదళ్ గత (2019) ఎన్నికల్లో రాష్ట్రంలోని 20 సీట్లలో 12 సీట్లు గెలిచండి. బిజేపి 8 సీట్లు గెలిచింది.  ఈసారి బిజూ జనతాదళ్ తొ పొత్తుపెట్టుకోవాలన్న బిజేపి ఆశలు అడియాసలే అయ్యాయి.ఇంతవరకు ఒరిస్సాలో జరిగిన ఎన్నికల్లో బిజేపి ప్రదర్శన  అనుకున్నంత గొప్పగా లేదని చెప్పకొంటున్నారు.

 

బిజేపికి కానీ ఎన్ ది ఏ కి  స్వంతంగా అనుకొన్నాన్ని సీట్లు రానపుడు, ఇండియా కూటమికి కూడా అదే పరిస్థితి వచ్చినపుడు, ఏ కూటమిలో లేని ఈ పార్టీలతో పాటు పశ్చిమ బెంగాల్ లో టి ఎం సి గెలిచే స్థానాలు, ఆయా పార్టీలు వ్యవహరించే తీరు దేశ రాజకీయాలను మార్చానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో వైఎస్ ఆర్ సిపి కాంగ్రెస్ తో కలవడానికి  ఆసక్తి చూపకపోవచ్చని, అలాగే టీఎంసీ అధినేత మమతా బెనర్జీ బిజేపిటో జాతకట్టక పోవచ్చు.  కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మాట మార్చే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు పూర్తయిన ఎన్నికల్లో 379 సీట్లలో బిజేపి అనుకూల మైన చోట కూడా కొంత నష్టం జరగనుందనే వార్తలు వస్తున్నాయి. గత 2019 ఎన్నికల్లో బిజేపి, రాజస్తాన్ లోని 25, గుజరాత్ లోని 26 సీట్లు, మధ్యప్రదేశ్ లోని 29 సీట్లలో 28 సీట్లు గెలుచుకోండి. అంటే మొత్తం 80 సీట్లలో 79 సీట్లు గెలుచుకోంది, కానీ ఈసారి ఈ రాజస్తాన్, గుజరాత్ లలో బలమైన రాజ్ పుత్ (క్షత్రీయులు) లు బలంగా బిజేపిని వ్యతిరేకించడం, పార్టీలోని అంతర్గత విభేదాలు పార్టీ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో అధికారం చేజిక్కించుకొన్న బిజేపి, అప్పుడే అంతర్గత విభేదాలతో గతంలో సాధించినాన్ని సీట్లు సాధించకపోవచ్చని తెలుస్తుంది. గతంలో ఈ మూడు రాష్ట్రాలలో 2019 లో గెలుచుకొన్న 79 సీట్లలో కనీసం 20-25 సీట్ల నష్టం జరగవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

దక్షిణాన  కర్ణాటక తో పాటు తెలంగాణలో మాత్రమే కొంత ఉనికిని చాటుకొన్న బిజేపి, ఈసారి కూడా తమిళనాడు, కేరళలో ఒక్క సీటు కూడా గెలవలేదనే అనుకొంటున్నారు. అయినా, తమిళనాడు, కేరళలో కనీసం ఒకటి రెండు స్థానలైనా గెలుస్తుందని ఇంకా బిజేపి నమ్ముతోంది. గత ఎన్నికల్లో కర్ణాటకలోని 28 సీట్లలో, 27 సీట్లు గెలుచుకొన్న బిజేపి, ఈసారి అక్కడ అధికారంలో లేకపోవడమే కాకుండా, ప్రజ్వల రెవన్న ఉదంతం రెండవసారి జరిగిన పోలింగ్ పై పెద్ద ప్రభావమే చూపుతుందని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చుతుందనే నమ్మకంతో ఓటర్ల లో కూడా మార్పు వచ్చిందని అనుకొంటున్నారు. ఈ పరిస్థితులలో బిజేపి కర్ణాటకలో కనీసం 10-12 సీట్లు కోల్పోవచ్చని భావిస్తున్నారు.

 

ఈ పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ తప్ప అన్నీ పార్టీలు అవసరం అయితే బిజేపి తో పెట్టుకోవచ్చని, టిడిపి, బి ఆర్ ఎస్, వి ఎస్ ఆర్ సి పి తమలోని విభేదాలను పక్కన పెట్టి అధికారంలోకి రావడానికి కూడా వెనుకడక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ పార్టీలు కాంగ్రెస్ కూటమికి కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చని, అధికారం కొరకు వీరంతా ఆకలితో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అధికార, ప్రతిపక్ష కూటమీలు రెండు కూడా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అనుకొన్నాన్ని సీట్లు రాబట్టుకొనే దిశలో లేవని అనుకొంటున్నారు. అలాంటప్పుడు బిజూ జనతాదళ్ తో పాటు, తెలుగు రాష్ట్రాల పార్టీలే కీలకం కానున్నాయి.

ఇక ముందు జరగబోయే మూడు దశల ఎన్నికల్లో 164 సీట్లలో ఎవరెన్ని సీట్లను గెలుచుకొంతరనే దానిపైనే ఏ కూటమి అధికారంలోకి రావడం అన్నది తెలిపోతుంది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ లలో గతంలో గెలిచిన సీట్లను నిలుపుకోలేని పార్టీ, హర్యానా, డిల్లీ, పంజాబ్ లలో కూడా గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను కూడా కొల్పవనున్నదనే వార్తలు బిజేపి అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మప్రధాని మోడి అనుకున్నతళులు, హిందూత్వం, ముస్లిం, రామ మందిరం అంశాలు బజని రక్షించలేకపోవచ్చని, కానీ ఎటు కానీ మద్యంతర పార్టీలు కాపాడుతాయన్న ధైర్యంతో బిజేపి-ఆర్ ఎస్ ఎస్ లు కొత్త ప్రణాళికలు రచిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది.      

Tags