అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం.

జగిత్యాల జిల్లాలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు & వేడుకల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి.

On
అంగరంగ వైభవంగా  సీతారాముల కల్యాణం.

(సిరిసిల్ల. రాజేంద్ర. శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 17 (ప్రజా మంటలు) : 

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయం, విద్యానగర్‌ ఎడ్ల అంగడి రామాలయం,చిన్నగట్టు అంజన్న దేవాలయం,మార్కండేయ దేవాలయాల్లో శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం నిర్వహించిన కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నీ భక్త శ్రదలతో సీతారాముల కల్యాణాన్ని వీక్షించారు.

ఆలయాల్లో రామనామ జపం,జై శ్రీరామ్ నినాదాలతో భక్తులు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో స్వామివారిని ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి దర్శించుకుని వేడుకల్లో పాల్గొన్నారు.

మార్కండేయ స్వామి ఆలయంలో జరిగిన రాములోరి కళ్యాణంలో స్వామివారలకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు సమర్పించి వేడుకల్లో పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు.

జగిత్యాల రూరల్ మండలం చిన్నగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో రాములోరి... కల్యాణాన్ని వేదబ్రహ్మణోత్తములు అత్యంత వైభవంగా జరిపించారు.స్వామి వారల ఉత్సవ మూర్తులను పల్లకిలో ఆంజనేయ స్వామి భక్తులు తీసుకువచ్చి అందంగా అలంకరించిన వేదికపై ఉంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు జరిపించారు.

చిన్న గట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఫౌండర్ చిట్ల అంజన్న-లత, వైద్యులు జంగిలి శశికాంత్ -రజిత దంపతులు కళ్యాణంలో పాల్గొని సీతా రాములకు

పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకల

కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ సతీమణి అహల్య, చంద్రకృష్ణా రెడ్డి,మాజీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కొప్పెర వెంకట్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ చిట్ల శంకర్,కౌన్సిలర్ చుక్క నవిన్ కుమార్, జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఎన్న0 కిషన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు అల్లాల సరితా రమేష్ రావు, గాజుల రాజేందర్,సిపెళ్లి రవీందర్, చిట్ల నవీన్,రజిత, మంజుల శైలజ, రమా, శ్రీనివాస్ పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షా పరులు, భక్తులు పాల్గొనగా అనంతరం అన్నదానం చేశారు.

Tags