గోపులాపూర్ లో ఘోరమైన దాడి  - ఒకరు మృతి - మరొకరు సీరియస్

On
గోపులాపూర్ లో ఘోరమైన దాడి  - ఒకరు మృతి - మరొకరు సీరియస్

గోపులాపూర్ లో ఘోరమైన దాడి  - ఒకరు మృతి - మరొకరు సీరియస్

(చుక్క విశాల్)

బుగ్గరం మే 17:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ లో అర్ధ రాత్రి ఉదయం 12- 1 ఒంటిగంట ప్రాంతంలో తీవ్రమైన దాడి జరిగింది. ఈ దాడిలో గోపులాపూర్ గ్రామంలోని దీటి శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న దీటి మహేష్ వరంగల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ వివాదానికి కారణం ఇల్లు కొనుగోలు విషయంలో జరిగిన పాత గొడవలనీ సమాచారం. ఈ వ్యక్తులను బుర్ర నవీన్ అతని స్నేహితులు కర్రలతో దాడి చేసినట్లు తెలిసింది. పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కూడా శుక్రవారం ఉదయం గోపులాపూర్ లోని సంఘటనా స్థలాన్ని పరిశీలించి, గ్రామంలో ప్రజలను విచారించి గొడవలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు

Tags