కన్న కూతురు పై అత్యాచారం కేసులో నిందితునికి 25 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 10,000/- జరిమాన.

- బాధిత మైనర్ బాలికకు 3 లక్షల రూపాయలు పరిహారం.

On

కొరుట్ల మే 15 ( ప్రజా మంటలు ) : 

కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిది కి చెందిన ఎల్లాల తుకారం అనే వ్యక్తి వ్యవసాయ చేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు.

ఇతనిపై గతంలో మొదటి భార్యని చంపిన కేసులో కేసు నమోదు కావడం జరిగింది. తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం వారికి ఒక కూతురు జన్మించడం జరిగింది. తేది 14-10-2022 రోజున రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో కన్నా కూతురిపై (మైనర్ బాలికపై) తుకారాం అత్యాచారం చేయడం జరిగింది. ఈ యొక్క అత్యాచారం గురించి ఎవరికైనా చెప్పితే భార్యను మరియు ఆ యొక్క మైనర్ బాలికను పెట్రోల్ పోసి చంపేస్తానని తుకారాం బెదిరించడం జరిగింది. భయభ్రాంతులకు గురైన తల్లి, మైనర్ బాలిక తేదీ 18-10-2022 రోజున తుకారాం యెుక్క మొదటి భార్య కుమారుడైన మహేష్ కు ఈ యొక్క విషయం గురించి తెలుపగ వారిని ఓదార్చి ఇట్టి విషయం గురించి పోలీస్ స్టేషన్లో తెలపడం జరిగింది. 

మైనర్ బాలిక అన్న 18-10-2022 తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 409 /2022,సెక్షన్స్ యూ/ఎస్ 376(2)(ఎఫ్)(ఎం) 376 (ఏ బి), 506 ఐ పి సి , సెక్షన్ 5(ఎం)(ఎన్) ఆఫ్ పోక్సో చట్టం కింద కోరుట్ల పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేయగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేకర్ రాజు కేసును విచారించడం జరిగింది.

బుధవారం పిపి, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షలను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన గౌరవ న్యాయమూర్తి నీలిమ నిందితుని పై నేరం రుజువు కాగా నిందితుడికి 25 సంవత్సరాల చొప్పున కఠిన కారగార శిక్ష మరియు 10,000/- జరిమాన, బాధిత బాలికలకు 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చారు. 

ఈ యొక్క కేస్ లో పీపీ గా మల్లికార్జున్ ,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా డీఎస్పీ రాజశేకర్ రాజు , ఎస్సై సతీష్ , సి ఎం ఎస్ ఎస్.ఐ రాజు నాయక్, సి ఎం ఎస్ కానిస్టేబుల్స్ కిరణ్, రాజు లు కోర్ట్ కానిస్టేబుల్ నీల నాయక్ లు నిందితుల కి శిక్ష పడడం లో గౌరవ కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. పై కేస్ లో నిందితు లకు శిక్ష పడటం పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అభినందించారు.

Tags