విద్యుత్ సిబ్బందికి అంతర్గత సమర్థత కై శిక్షణ.

On
విద్యుత్ సిబ్బందికి అంతర్గత సమర్థత కై శిక్షణ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు) : 

 సిఎండి, టిఎస్ఎన్ పిడిసిఎల్, ఆదేశాల ప్రకారం తేదీ 18-04-2024 నుండి 06-05-2024 వరకు టిఎస్ఎన్ పిడిఎల్, జగిత్యాల జిల్లా పరిధి లోని ఆపరేషన్ మరియు మైంటెనెన్సు విద్యుత్ సిబ్బంది అందరికి, జూనియర్ లైన్మెన్ నుండి ఫోర్ మెన్ క్యాడర్ వరకు, సిబ్బంది అంతర్గత సమర్థత అభివృద్ధి కోసం శిక్షణ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్ సరఫరా కొరకు మరియు విద్యుత్ సంస్థ అభివృద్ధి కోసం బ్యాచ్ ల వారీగా 2 రోజుల చొప్పున మాస్టర్ ట్రైనర్స్ మరియు డి ఈ టెక్నికల్ ఆధ్వర్యంలో, డిప్లొమా ఇంజనీర్స్ భవనం, జగిత్యాల మీటింగ్ హాల్ లో శిక్షణ తరగతులు ఆరంభించినారు.

ఈ సమావేశం లో ఎస్ఈ. జి. సత్యనారాయణ, శుక్రవారం 4 వ బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి అయిన సందర్బంగా , మాట్లాడుతు...... వినియోగదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని , విద్యుత్ సిబ్బంది విధులు మరియు బాధ్యతలు తెలియ చేసి, అందరిచే ప్రతిజ్ఞ చేయించారు.,

అలాగే భారీ వర్షాలు, గాలి దుమరాలు వీచే సమయములో, విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని, స్పాట్ ఎర్థింగ్ చేసుకొని లైన్ పనులు చేయాలని, అలాగే వినియోగదారులు కూడా విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తల గురించి అవగాహనా కల్పించాలని, అన్ని పరికరాలకు, ఇనుప వస్తువులకు ఎర్థింగ్ చేసుకొని కరెంట్ షాక్ రాకుండా నిరోధించవచ్చని ,విద్యుత్ చాలా ప్రమాదకరం,కంటికి కనపడదు,కావున అన్ని జాగ్రత్త లు తీసుకోవాలని తెలిపారు,

33కే వి, 11కే వి లైన్ ల నిర్వహణ తరుచుగా చేస్తూ కరెంట్ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలనీ,100% బిల్లులు వసూలు చేయాలనీ, విద్యుత్ బిల్లులు ఆన్లైన్లో చెల్లించేలా అవగాహన కల్పించాలని, కరెంట్ బిల్లులు సమయానికి కొ ఇవ్వాలని, స్టాఫ్ అందరూ స్థానికముగా హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని, వినియోగదారులకు సమయానికి సేవలందిస్తూ, సంస్థకు మంచి పేరు తీసుకు రావాలని కోరారు.

ఈ శిక్షణ కార్యక్రమం లో, నలుగురు మాస్టర్ ట్రైనర్ లు, 

సీనియర్ అధికారులు,వివిధ అంశాల పై అవగాహనా శిక్షణ ఇచ్చారు.

మనోహర్ దురిశెట్టి,ఏ డి ఈ, మెట్టుపల్లి చే, సిబ్బంది కి ప్రేరణ తరగతులు, పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా తెలియ చేశారు.

లవకుమార్ , ఎం డి డాక్టర్ చే, ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సి పి ఆర్ కృత్రిమ శ్వాస పద్ధతులు,ప్రతమ చికిత్స పద్ధతులు తెలియ చేశారు.

రాజమల్లు, లైన్ ఇన్స్పెక్టర్ చే, మానసిక, శారీరక ఆరోగ్యం కొరకు యోగ, ధ్యానం శిక్షణ ఇచ్చారు.

నేటి సమావేశం కు కే. గంగారాం -డిఈ / టెక్నికల్, రాజిరెడ్డి, - డిఈ, జగిత్యాల,తిరుపతి-డి ఈ, మెట్టుపల్లి,రవీందర్ - డిఈ, ఎం ఆర్ టి,మనోహర్, ఏ డి ఈ, మెట్టుపల్లి,నగేష్ కుమార్,ఏ డి ఈ, టెక్నికల్, మరియు ఏ డి ఈ లు, ఏఈ లు, ఓ , ఎం విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags