నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి? తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు ?
నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి? తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు
గతంలో గెలిచిన 42 సీట్లు నిలబెట్టుకోలేని బిజేపి
కూటమిలో లేని ప్రాంతీయ పార్టీల మాటనే నెగ్గుతుందా ?
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
హైదరాబాద్ మె 13 :
నాల్గవ దశ ఎన్నికలు పూర్తయిన తరువాత పోసింగ్ సరళిని పరిశీలించిన విశ్లేషకులు, ఈ దశలో బిజేపికి అనుకున్నన్ని సీట్లు రావడం సాధ్యంకాదనే అంచనాకు వచ్చారు. పది రాష్ట్రాలలో, 96 పార్లమెంట్ స్థానాలలో జరిగిన ఎన్నికల్లో గతంలో 42 స్థానాలను గెలుచుకొన్న బిజేపి, ఈసారి తన సీట్లను నిలుపుకోవడానికి తీవరపయత్నాలే చేసింది. బిజేపి మళ్ళీ అధికారంలోకి రావడానికి స్వంతంగా కానీ ఎన్ ది ఏ కూటమి కూడా, అధికారంలోకి రావడానికి కావాల్సిన 272 సీట్లు రావడామే కష్టమనే వార్తలు వస్తున్నాయి. ఈదశలో ఏ కూటమిలో లేని పార్టీలు గెలిచే సీట్లతో పాటు, తెలుగు రాష్ట్రాలలోని టిడిపి, వై ఎస్ ఆర్ సి పి లతో పాటు, తెలంగాణలో బి ఆర్ ఎస్ గెలిచే సీట్లు కూడా ప్రధానం కానున్నాయి.
ఎప్పుడు బిజేపికి మద్దతు ప్రకటిస్తు, స్వతంత్రంగా వ్యవహరించే ఒరిస్సా లోని బిజూ జనతాదళ్ గత (2019) ఎన్నికల్లో రాష్ట్రంలోని 20 సీట్లలో 12 సీట్లు గెలిచండి. బిజేపి 8 సీట్లు గెలిచింది. ఈసారి బిజూ జనతాదళ్ తొ పొత్తుపెట్టుకోవాలన్న బిజేపి ఆశలు అడియాసలే అయ్యాయి.ఇంతవరకు ఒరిస్సాలో జరిగిన ఎన్నికల్లో బిజేపి ప్రదర్శన అనుకున్నంత గొప్పగా లేదని చెప్పకొంటున్నారు.
బిజేపికి కానీ ఎన్ ది ఏ కి స్వంతంగా అనుకొన్నాన్ని సీట్లు రానపుడు, ఇండియా కూటమికి కూడా అదే పరిస్థితి వచ్చినపుడు, ఏ కూటమిలో లేని ఈ పార్టీలతో పాటు పశ్చిమ బెంగాల్ లో టి ఎం సి గెలిచే స్థానాలు, ఆయా పార్టీలు వ్యవహరించే తీరు దేశ రాజకీయాలను మార్చానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో వైఎస్ ఆర్ సిపి కాంగ్రెస్ తో కలవడానికి ఆసక్తి చూపకపోవచ్చని, అలాగే టీఎంసీ అధినేత మమతా బెనర్జీ బిజేపిటో జాతకట్టక పోవచ్చు. కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మాట మార్చే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు పూర్తయిన ఎన్నికల్లో 380 సీట్లలో బిజేపి అనుకూల మైన చోట కూడా కొంత నష్టం జరగనుందనే వార్తలు వస్తున్నాయి. గత 2019 ఎన్నికల్లో బిజేపి, రాజస్తాన్ లోని 25, గుజరాత్ లోని 26 సీట్లు, మధ్యప్రదేశ్ లోని 29 సీట్లలో 28 సీట్లు గెలుచుకోండి. అంటే మొత్తం 80 సీట్లలో 79 సీట్లు గెలుచుకోంది, కానీ ఈసారి ఈ రాజస్తాన్, గుజరాత్ లలో బలమైన రాజ్ పుత్ (క్షత్రీయులు) లు బలంగా బిజేపిని వ్యతిరేకించడం, పార్టీలోని అంతర్గత విభేదాలు పార్టీ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో అధికారం చేజిక్కించుకొన్న బిజేపి, అప్పుడే అంతర్గత విభేదాలతో గతంలో సాధించినాన్ని సీట్లు సాధించకపోవచ్చని తెలుస్తుంది. గతంలో ఈ మూడు రాష్ట్రాలలో 2019 లో గెలుచుకొన్న 79 సీట్లలో కనీసం 20-25 సీట్ల నష్టం జరగవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
దక్షిణాన కర్ణాటక తో పాటు తెలంగాణలో మాత్రమే కొంత ఉనికిని చాటుకొన్న బిజేపి, ఈసారి కూడా తమిళనాడు, కేరళలో ఒక్క సీటు కూడా గెలవలేదనే అనుకొంటున్నారు. అయినా, తమిళనాడు, కేరళలో కనీసం ఒకటి రెండు స్థానలైనా గెలుస్తుందని ఇంకా బిజేపి నమ్ముతోంది. గత ఎన్నికల్లో కర్ణాటకలోని 28 సీట్లలో, 27 సీట్లు గెలుచుకొన్న బిజేపి, ఈసారి అక్కడ అధికారంలో లేకపోవడమే కాకుండా, ప్రజ్వల రెవన్న ఉదంతం రెండవసారి జరిగిన పోలింగ్ పై పెద్ద ప్రభావమే చూపుతుందని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చుతుందనే నమ్మకంతో ఓటర్ల లో కూడా మార్పు వచ్చిందని అనుకొంటున్నారు. ఈ పరిస్థితులలో బిజేపి కర్ణాటకలో కనీసం 10-12 సీట్లు కోల్పోవచ్చని భావిస్తున్నారు.
ఈ పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ తప్ప అన్నీ పార్టీలు అవసరం అయితే బిజేపి తో పెట్టుకోవచ్చని, టిడిపి, బి ఆర్ ఎస్, వి ఎస్ ఆర్ సి పి తమలోని విభేదాలను పక్కన పెట్టి అధికారంలోకి రావడానికి కూడా వెనుకడక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ పార్టీలు కాంగ్రెస్ కూటమికి కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చని, అధికారం కొరకు వీరంతా ఆకలితో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అధికార, ప్రతిపక్ష కూటమీలు రెండు కూడా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అనుకొన్నాన్ని సీట్లు రాబట్టుకొనే దిశలో లేవని అనుకొంటున్నారు. అలాంటప్పుడు బిజూ జనతాదళ్ తో పాటు, తెలుగు రాష్ట్రాల పార్టీలే కీలకం కానున్నాయి.
ఇక ముందు జరగబోయే మూడు దశల ఎన్నికల్లో 164 సీట్లలో ఎవరెన్ని సీట్లను గెలుచుకొంతరనే దానిపైనే ఏ కూటమి అధికారంలోకి రావడం అన్నది తెలిపోతుంది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ లలో గతంలో గెలిచిన సీట్లను నిలుపుకోలేని పార్టీ, హర్యానా, డిల్లీ, పంజాబ్ లలో కూడా గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను కూడా కొల్పవనున్నదనే వార్తలు బిజేపి అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మప్రధాని మోడి అనుకున్నతళులు, హిందూత్వం, ముస్లిం, రామ మందిరం అంశాలు బజని రక్షించలేకపోవచ్చని, కానీ ఎటు కానీ మద్యంతర పార్టీలు కాపాడుతాయన్న ధైర్యంతో బిజేపి-ఆర్ ఎస్ ఎస్ లు కొత్త ప్రణాళికలు రచిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
సంచర జాతుల వారికి ఆహారం పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 27 ( ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్కు నివాళులు అర్పించారు. నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతుల కుటుంబాలను గుర్తించి వారికి ఆహారం అందించారు.
దేశాభివృద్ధికి విద్యే ప్రధాన పునాది... జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం : ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల, జనవరి 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్లో గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాలకు రూ.62.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గత అధికారుల నిర్లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ లేక ఇష్టారీతిన నిర్మాణాలు జరిగాయని విమర్శించారు.
అభివృద్ధికి అడ్డంకులు... తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదీ ప్రకటించారు. నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ముఖ్య తేదీలు
నామినేషన్లు: జనవరి 28 నుంచి 30 వరకు
పరిశీలన: జనవరి 31
ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3... బీసీ కులగణన అవసరం - జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు)::
ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నవీన్ ఆచారి తెలిపారు.
బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దేశవ్యాప్తంగా పకడ్బందీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు.
ఒకే కులానికి భిన్న పేర్లు, వలస కులాల సమస్యలపై... గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు : జాగృతి నేత కవిత తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల నుంచి దూరం చేయడానికి ప్రధాన కారణం సంతోష్ రావేనని జాగృతి నేత తీవ్ర ఆరోపణలు చేశారు. గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారిగా వ్యవహరిస్తూ కేసీఆర్ వ్యక్తిగత విషయాల వరకూ సమాచారాన్ని చేరవేసిన వ్యక్తి సంతోష్ రావేనని విమర్శించారు.
కేసీఆర్ ఫార్మ్... చెన్నైలో గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ :సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం
చెన్నై, జనవరి 27:
తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ మంగళవారం, బుధవారం (జనవరి 27, 28) తేదీల్లో చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్ లో జరుగుతోంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.... ఆస్కార్ అవార్డు లకు 10 సినిమాలు పోటీ
–వర్తమానం సంగమంగా మారిన సినిమా వేడుక
ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) ఈసారి కేవలం అవార్డుల వేడుకగా మాత్రమే కాకుండా —👉 సమాజం, రాజకీయాలు, చరిత్ర, మానవ విలువలపై చర్చకు వేదికగా మారింది.
🏆 బెస్ట్ పిక్చర్ విభాగం ఎందుకు ప్రత్యేకం?
ఈ... బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
హైదరాబాద్ / వరంగల్ జనవరి 26, (ప్రజా మంటలు):మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్న ఆయన, పార్టీ మార్పు వెనుక ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. త్వరలో... ఇన్నయ్యకు జాగృతి అండగా ఉంటుంది: జనగాంలో కవిత వ్యాఖ్యలు
జనగాం, జనవరి 26 (ప్రజా మంటలు):
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఎవరూ మాట్లాడని సమయంలోనే ‘దగాపడ్డ తెలంగాణ’ అనే పుస్తకాన్ని ప్రచురించి, 1997లో అదే పేరుతో సభ నిర్వహించి ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఇన్నయ్య అని జాగృతి నేతలు పేర్కొన్నారు. తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని ఉద్యమంలోకి తీసుకువచ్చారని తెలిపారు.... కల్లెడ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవమని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ మెనేని రవీందర్ రావు అన్నారు.
గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ చేట్కూరి... రాయికల్లో టీయూడబ్ల్యూజే–ఐజేయు నూతన కార్యవర్గం ఎన్నిక
రాయికల్, జనవరి 26 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణంలో టీయూడబ్ల్యూజే–ఐజేయు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షుడు గడ్డల హరికృష్ణ, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడిగా గుర్రాల వేణుగోపాల్, ఉపాధ్యక్షుడిగా వాసరి రవి, ప్రధాన కార్యదర్శిగా నాగమల్ల శ్రీకర్,... 