పలు పోలింగ్ కేంద్రాలు సందర్శించి పురాణి పేట ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. శ్రావణి.

On
పలు పోలింగ్ కేంద్రాలు సందర్శించి పురాణి పేట ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. శ్రావణి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల మే 13( ప్రజా మంటలు ) :

సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గంలో పలు పోలింగ్ బూత్ లను సందర్శించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ డా. బోగ శ్రావణి.

ఇదిలా ఉండగా తన ఓటు హక్కును పట్టణంలోని పురానిపేట ప్రభుత్వ హైస్కూల్లో వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా శ్రావణి మీడియాతో మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడుతున్న మోడీ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని తమ అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

Tags