కరీంనగర్ లో కాంగ్రెస్ జన ప్రభంజనం వెలిచాల "శక్తి ప్రదర్శన"- 70 వేల మందితో భారీ ప్రదర్శన. గెలుపు ఖాయమని రాజేందర్ రావు వెల్లడి
కరీంనగర్ లో కాంగ్రెస్ జన ప్రభంజనం
వెలిచాల "శక్తి ప్రదర్శన"- 70 వేల మందితో భారీ ప్రదర్శన.
గెలుపు ఖాయమని రాజేందర్ రావు వెల్లడి
- వెయ్యి మంది కళాకారులతో కాంగ్రెస్ మీటింగ్ జన సంద్రం
కరీంనగర్ మే 11 (ప్రజా మంటలు) :. ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు మద్దతుగా, దాదాపు 70 వేల మంది హాజరైన ప్రజలతో గీతా భవన్ చౌరస్తాలో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన నిర్వహించారు. శక్తి యాత్ర పేరుతో ప్రచారం చివరి రోజు నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన జన ప్రభంజనం కాంగ్రెస్ నాయకుల ఉత్సాహాన్ని పెంచింది.
వెయ్యి మంది కళాకారులు భిన్న ప్రదర్శనల్లో అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు హుషారుగా పాల్గొని, తన గెలుపు కోసం స్వచ్చందంగా తరలివచ్చిన జన సమూహాన్ని చూసి రాజేందర్ రావు రెట్టించిన ఉత్సాహంతో కళాకారుల స్టెప్పులకు జత కలిశారు. నృత్యం చేస్తూ, డప్పు వాయిస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిన పూనిన కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం నెరవేరడం ఖాయంగా శక్తి యాత్ర నిరూపించిందని, భారీ సందడి, ప్రముఖ నేతల ప్రసంగం అనంతరం గీతా భవన్ చౌరస్తా నుంచి బస్ స్టేషన్ వరకు ఓపెన్ టాప్ వాహనంపై నిల్చుని వెలిచాల రాజేందర్ రావు భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రచారం చివరి రోజైనా శనివారం నాటి శక్తి యాత్రకు హాజరైన జన ప్రభంజనం కాంగ్రెస్ గెలుపుకహాయమని నిరూపించిందని వెలిచాల రాజేందర్ రావు తనప్రసంగంలో అన్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతికి పాల్పడి 30శాతం కమిషన్ పంచుకున్న అవినీతిపరులు, కరీంనగర్ ప్రజల సమస్యలపై కనీస అవగాహనలేని దద్దమ్మలు మనకి అవసరమా? అని వెలిచాల రాజేందర్ రావు ప్రశ్నించారు. గత పదేళ్లపాటు ఎంపీలుగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్, బండి సంజయ్ లు నయా పైసా అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. బండి సంజయ్ కి మరోసారి అవకాశం కల్పిస్తే కరీంనగర్ ను అభివృద్ధి చేయడని, తానే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడని పేర్కొన్నారు. 2014లో నామినేషన్ పత్రాలు కొనేందుకు భార్య పుస్తల తాడు అమ్మిన బండి సంజయ్ ఇప్పుడు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని నిలదీశారు. ఎన్నికల సమయంలో వందల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నాడని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామని బహిర్గతంగానే చెబుతోందని, అలాంటి బిజెపికి ఓటు వేయటం అవసరమా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలు తొలగించి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం అంటున్న బిజెపిని బండకేసి కొట్టాలని రాజేందర్ రావు పిలుపునిచ్చారు.
--------
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
