ఎస్.కే.ఎన్.ఆర్ బాలికల కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి.

On
ఎస్.కే.ఎన్.ఆర్ బాలికల కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల మే 13 ( ప్రజా మంటలు )

సోమవారం నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని ఎస్.కె.ఎన్.ఆర్ బాలికల ప్రభుత్వ కళాశాలలో వినియోగించుకున్నారు.

అనంతరం మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ...... అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

దేశ సమైక్యత కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని తన గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు.

Tags