తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ. - తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.
తెలంగాణలో కేసీఆర్ వైఖరి నిన్నటి చర్చ.
తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆస్కారం లేదు.
తుడిచిపెట్టుకుపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ఇదే.
ఇది జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు దెబ్బగా పనిచేస్తుంది.
-రాపోలు ఆనంద భాస్కర్, మాజీ రాజ్యసభ సభ్యుడు
తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగు జాతీయ స్థాయిలో, దేశ వ్యాప్తంగా తప్పుడు సంకేతం. జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు ఒక గొడ్డలి పెట్టు.
ఏదైనా ఒక ప్రాంతంలో ఒక క్షేత్రీయ పార్టీ బలపడి, తననుతాను అనేక ఆటుపోట్లతో, భారీ విజయాలతో పెంచుకొని, విస్తారమైన ఆర్థిక, భవన సంపదలతో ఎదిగిన తర్వాత, ఇంత ఘోరంగా విఫలం కావడం తాజాగా తెరాసనే.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక పాత్ర కలిగి, కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాలలో అగ్ర భాగాన నిలిపిన పరిపాలకుడిగా భూమిక సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్థాపించి, పేరు మార్చి, అధోగతి పాలు చేసిన పార్టీ వల్ల, దేశంలోనే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఉత్థాన, పతనాల చరిత్రలో గుగుర్పాటు కలిగింది. విద్యార్థి ఉద్యమంతో అడుగిడి, ప్రాంతీయ పార్టీగా ప్రపంచ ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించి, మరుగయిన ప్రఫుల్ల కుమార్ మహంతా, ఆయన అస్సాం గణ పరిషత్ తర్వాత అంతటి ఉనికి సమస్యను కేసీఆర్, ఆయన మాజీ తెరాస, తాజా భారత రాష్ట్ర సమితి పార్టీ ఎదుర్కొంటున్నది.
ఆయన యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి పాత్రికేయునిగా, 2022 అక్టోబర్ లో తన పిలుపు మేరకు, గడపలోకి అడుగెట్టి, నిన్నమొన్నటిదాకా అక్కడే నిలుచున్న యోధుడిగా, రాజకీయవేత్తగా కేసీఆర్ ను నిశితంగా గమనించిన వ్యక్తి గా నా పరిశీలన. పార్టీ పుట్టడం, పెరగడం, ఉనికిని సంతరించుకోవడం, ఇంతగా చరిత్ర సృష్టించడంలో ఆయనతోపాటు వేలాది మంది త్యాగాలు, లక్షలాది మంది కాయకష్టం ఉంటుంది. వారందరిపట్ల సానుభూతి తో,దేశ రాజకీయ చిత్రంలో ఆ పార్టీ చోటు ఛిద్రమవుతున్నందుకు ఒకింత విచారం.
మొన్న లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిస్తూ, ప్రధాన మంత్రి పదవికి పోటీదారునని కేసీఆర్ చేసిన ప్రస్తావన. కేవలం ఊహ కోసం తెలంగాణ లో 15 లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ పార్టీ గెలుస్తుందని అనుకుంటే, 300 స్థానాలు కలిగిన పార్టీనో, కూటమో నిలిపే వ్యక్తి ఆ పదవిని పొందగలుగుతాడు. ఇప్పుడు మూడు చోట్ల గెలుస్తారా అంటే, నమ్మకం చెప్పలేని పరిస్థితి. మూడు గెలిస్తే ఒక్క శాతం, ఆయన చెప్పే అద్భుతం జరిగి 15 గెలిస్తే 5 శాతం సంఖ్యాబలం తో ఏం చేయగలడు. అందుకే, అది విన్న కొందరు చైతన్యవంతులు ఆయన తీరు మారలేదని, వేరే వైపు ఓటు మళ్ళించారు. జాతీయ రాజకీయాల్లో ఆయనను మూడో వ్యక్తి నమ్మే పరిస్థతి లేదని ఆయనకు కూడా తెలుసు. ఎందుకీ ప్రగల్భాలు, పగటి కలలు.
పక్క రాష్ట్రం ముచ్చట మాటిమాటికి తనకు ఎందుకు? ఆంధ్ర ఫలితాలు చూసుకోవడానికి కేసీఆర్ అవసరమని అక్కడ ఎవరూ అనుకోనప్పుడు, తగుదునమ్మా అని అక్కడి మంత్రసానితనమెందుకు? ఫలితంగా ఆ రాష్ట్రం అధికారం కోసం తహతహలాడుతున్న కులాల వారు, వారి సానుభూతిపరులు తెలంగాణ లో ఆయనను శత్రువుగా నిర్ధారించారు. వేరే పార్టీల శాసన సభ్యుల జట్టుచేసుకోవడం, వచ్చిన ఉప ఎన్నికలను ఉపద్రవాలుగా మార్చి, తప్పుడు సంప్రదాయాలకు, విపరీత ఆర్థిక విచ్చలవిడితనానికి, ఓటర్లలో భ్రాంతికి దారితీశారు. బలుపు ప్రయోగాలు పెరిగి, భావోద్వేగం అడుగంటింది.
ఉద్యమ, ప్రాంతీయ భావోద్వేగానికి కేసీఆర్ రవ్వంత విలువ మిగల్చకపోవడం, తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనులకు మానసిక వేదన మిగిల్చింది. కాళేశ్వరం సమగ్ర గోదావరి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అనే దాని విశ్వరూపాన్ని, మేడిగడ్డ బ్యారేజీ మూడు స్తంభాలు కుంగే వరకు, జనం మదిలో నింపలేదు. ఓడిపోయినా చిలుకపలుకులు జనానికి చేరేలోపు, పుణ్యకాలం గడిచింది. తాగునీటి భగీరథ యత్నంలో ఇమిడి ఉన్న విలువ ఆ నీటిని తాగుతున్నవారికి అర్ధం చేయించే ప్రయత్నమే జరగలేదు.
నిరంతర విద్యుత్ సరఫరా లోతుపాతులను వినియోగదారులకు అర్ధమయ్యేలా ఎన్నడూ చేయలేదు. రైతుబంధు సముచిత పరిమితి ఏర్పరచక, విచ్చలవిడితనం మేలుకన్నా కూడే చేసింది. విమర్శ పట్ల అసహనం, విభేదిస్తున్నవారి పట్ల నిఘా, ఓర్పుతో సామాన్య ప్రజానీకం మధ్యకు అప్పుడప్పుడు వెళ్ళే ప్రయత్నం క్రమంగా ముళ్ళకంచెలుగా మారాయి. తిరగబడినవారిని పెట్టిన ముప్పుతిప్పలు జనానికి అసహనం కలిగించింది.
కేసీఆర్ శత్రు భయంకరుడు. పథకాల అమలు పర్యవసాలు ఆలోచించని ఆడంబరం పెనుశాపమయింది. సొంత పార్టీలోని తాము పరాయిలమనే భావించే పరిస్థతి. అంతా తానే. అంతా తనదే అనే భ్రమ, ప్రగతి భవన్ నుంచి ఎంతో వికారంగా ముఖం దాచుకుని వెళ్ళే నికృష్ట స్థితి. తెలంగాణ లో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ అన్నీ బాగానే చేశారని, ఆయన చేసినంతగా కొత్తగా వచ్చినవాళ్ళు చేయలేకపోతున్నారని ఆవేదన నిజమే. కానీ, అవన్నీ తీర్చడానికి మళ్ళీ కేసీఆర్ కావాలనే స్థితి కి జనం రాలేరు.
ఎందుకంటే, పెట్టిపొయ్యకపోయినా, పెయ్యలకు పునికి చూసే ఉదారత కావాలి. జంతువు ఈనినతర్వాత పుట్టిన దూడ సరిగా దగ్గరికి రాకపోతే, అరే! ఇది ఈన నేర్చింది కానీ, నాక నేర్వలేదు, అంటారు. కేసీఆర్ పరిస్థితి అదే. అందుకే ఆయన అధికారం కోల్పోయినా, తుంటి విరిగి మంచం పాలయినా, అంతకుముందు ఆయన వద్ద అన్నీ అనుభవించిన వారు వరదలా దూరమయినా, ప్రజల్లో కదలిక లేదు. దాంతో ఆయన రాజకీయ నిర్మాణం నిరర్ధకమైంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల స్థావరం జాతీయ పార్టీల పరం కావడం దేశ రాజకీయాలలోనే సంచలన పరిణామం.
More News...
<%- node_title %>
<%- node_title %>
యుద్ధానికి ముగింపు కోసం పుతిన్‌తో భేటీ: ట్రంప్ ప్రకటన
డావోస్ | జనవరి 22 :
ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు తీసుకురావడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను త్వరలోనే కలవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. స్విట్జర్లాండ్‌లోని డావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొన్న ట్రంప్, మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ట్రంప్... బీఎంసీ మేయర్ ఎంపికపై బీజేపీలో అసంతృప్తి తేజస్వి గోసాల్కర్‌కు పదవి… మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమా?
ముంబై జనవరి 22:
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కొత్త మేయర్‌గా బీజేపీ నేత తేజస్వి గోసాల్కర్ ఎన్నిక కావడంతో ముంబై రాజకీయాల్లోనే కాదు, బీజేపీ అంతర్గత వర్గాల్లోనూ చర్చలు, అసంతృప్తి మొదలైంది. ఈ ఎన్నిక బీజేపీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు పార్టీ లోపల నుంచే వినిపిస్తున్నాయి.
తేజస్వి గోసాల్కర్ ఇటీవల జరిగిన... మీర-భాయందర్‌కు తొలి బెంగాలీ మేయర్? జయ దత్త పేరుతో బీజేపీ ఆలోచన… ఎంఎన్ఎస్ తీవ్ర వ్యతిరేకత
ముంబై జనవరి 22:ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో మరోసారి ‘మరాఠీ వర్సెస్ బయటి వారు’ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఈ వివాదానికి కేంద్రంగా మారింది ముంబై సమీపంలోని మీరా-భాయందర్. మేయర్ పదవికి సంబంధించి బీజేపీ తీసుకునే అవకాశమున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
మీరా-భాయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (MBMC) తాజా ఎన్నికల్లో... 3వ రోజు కొనసాగుతున్న శివ మహాపురాణం
జగిత్యాల జనవరి 22 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో, భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ చే, శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం గురు వారం 3 వ రోజుకు చేరింది. బ్రహ్మశ్రీ భాస్కర... 84 లక్షల ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం పున ప్రారంభించిన, ---- ఎస్టి ఎస్సి సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్.
వెల్గటూర్ జనవరి 22 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామంలో గతంలో ట్రాన్స్ఫార్మాల కాపర్ దొంగిలించబడి లిఫ్ట్ నడవక రైతులు నానా ఇబ్బందులకు గురయ్యారు. రైతులు మంత్రి దృష్టికి తీసుకుపోగా ఇబ్బందులను తొలగించడానికి ఇరిగేషన్ మంత్రి ఉత్త కుమార్ రెడ్డి కి ప్రత్యేకంగా విన్నవించి మంజూరు ఇప్పించారు.
ఏసంగి పంటకు నీరు... రాయికల్ మున్సిపల్ ను అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ దే జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత
రాయికల్ జనవరి 22 ( ప్రజా మంటలు) పట్టణం లో.బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం లో పాల్గొన్న జిల్లా తొలి జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ....* గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ ను మున్సిపల్ గా మార్చి 25 కోట్లతో ప్రతి వార్డులో... విజయ్ టీవీకే పార్టీకి ‘విజిల్’ ఎన్నికల గుర్తు కేటాయింపు
చెన్నై జనవరి 22 (ప్రజా మంటలు):
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రాజకీయ రంగంలో కీలక అడుగు వేసింది. పార్టీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి ‘విజిల్’ (Whistle) ఎన్నికల... ఇజ్రాయిల్ దాడిలో 3 గురు జర్నలిస్టుల మృతి
గాజా, జనవరి 22:
ఇజ్రాయెల్–హమాస్ మధ్య అక్టోబర్‌లో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ (సీజ్ఫైర్) ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులు కొనసాగిస్తోంది. తాజా ఘటనలో గాజా నగరానికి దక్షిణంగా ప్రయాణిస్తున్న కారుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపి ముగ్గురు జర్నలిస్టులను హతమార్చినట్లు రక్షణ సిబ్బంది మరియు స్థానిక పాత్రికేయులు వెల్లడించారు.
సమాచారం సేకరణ కోసం... ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం ముగ్గురు మృతి.
నంద్యాల, జనవరి 23 (ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఏఆర్ బీసీవీఆర్ (AR BCVR) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సుకు భారీగా మంటలు వ్యాపించడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.... న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం
నాగ్‌పూర్, జనవరి 21:భారత్–న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.
భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యం :
కరీంనగర్ జనవరి 21 (ప్రజా మంటలు):
పార్లమెంట్ పరిధిలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
అదేవిధంగా కరీంనగర్... గ్రీన్‌ల్యాండ్‌పై సైనిక చర్య లేదు : డావోస్ WEFలో ట్రంప్ వ్యాఖ్యలు:
దావోస్ (స్విట్జర్లాండ్) జనవరి 21;
డావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను డెన్మార్క్ నుంచి సైనిక బలంతో స్వాధీనం చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికా జాతీయ భద్రతకు కీలకమని పేర్కొన్న ట్రంప్, దాని రక్షణ, అభివృద్ధి కోసం అమెరికా యాజమాన్యం అవసరమని... 