ఘనంగా ఆదిశంకరుని జయంతి, 27 కుండాలతో యజ్ఞం.

On
ఘనంగా ఆదిశంకరుని జయంతి, 27 కుండాలతో యజ్ఞం.

జగిత్యాల మే 12 (ప్రజా మంటలు)

జిల్లా కేంద్రంలోని శుభ మస్తు హాల్ లో ఆది శంకరాచార్య జయంతి సందర్బంగా శ్రీ విష్ణు సహస్రనామ, శ్రీ లలితా సహస్ర నామ, కనకధారా స్తోత్ర, మాహా యజ్ఞం ఘనంగా జరిగినది.

శ్రీ మాన్ నంబి వేణు గోపాల ఆచార్య కౌశిక మంగళా శాసనము లతో,బ్రహ్మశ్రీ తిగుళ్ల విషు శర్మ ప్రత్యక్ష పర్యవేక్షణలో, శ్రీ పాద లక్ష్మీ నరసింహ శాస్త్రి. బృందం మహా యజ్ఞము నిర్వచించారు.

27 యజ్ఞ కుండాలు 108 జంటలు యజ్ఞము లో కూర్చున్నారు. తవుటు రామచంద్రం, శ్రీదేవి దంపతులు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తుంటే పురోహితుల బృందం యజ్ఞ కార్య క్రమం జరిపారు.అనంతరం జరిగిన అన్నదానంలో 600మంది భక్తులు , మాతలు పాల్గోన్నారు.

Tags