ఘనంగా శ్రీ ఆదిశంకరాచార్య, శ్రీ రామానుజ చార్య జయంతి వేడుకలు

On
ఘనంగా శ్రీ ఆదిశంకరాచార్య, శ్రీ రామానుజ చార్య జయంతి వేడుకలు

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల మే 12 (ప్రజా మంటలు)

అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతములు ప్రతిపాదించిన మహనీయులు శ్రీ ఆదిశంకరాచార్య, శ్రీ రామానుజాచార్య జయంతి వేడుకలు సోమవారం సాయంత్రం 6 గంటలకు జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వైదిక క్రతువులను సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, రుద్రంగి గోపాల కృష్ణ శర్మ, భట్టాజి గోపాల్ శర్మ, సంగనబట్ల నరేంద్ర శర్మలు నిర్వహించారు.

భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

మంగళహారతి, మంత్రపుష్పం అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ తో పాటు ఆశీర్వచనము చేశారు.

Tags