అన్నా అంటే - నేనున్నా అంటా మళ్ళీ నన్ను ఆశీర్వదించి ఎం పి. గా పంపండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

On
అన్నా అంటే - నేనున్నా అంటా  మళ్ళీ నన్ను ఆశీర్వదించి ఎం పి. గా పంపండి  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

అన్నా అంటే - నేనున్నా అంటా

మళ్ళీ నన్ను ఆశీర్వదించి ఎం పి. గా పంపండి

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

(రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి మే 10 (ప్రజా మంటలు) : ఆపదలో, అవసరాలకు అన్నా అని ఎవరైనా పిలిస్తే నేనున్నా అంటూ ఎల్లపుడూ అందుబాటులో ఉండే తాను శాసన సభ ఎన్నికలలో ఓటమి పాలైనా, లక్ష్మీ నృసింహ స్వామి కృప వల్ల, మళ్ళీ ప్రజా సేవకే అంకితం అయ్యేందుకు లోకసభ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కేసిఆర్ కల్పించారని, ఈసారి ప్రజల మద్దతు కావాలని మాజీ మంత్రి, పెద్ద పెల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. శుక్రవారం రాత్రి ధర్మపురి క్షేత్రంలో రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ...తాను ధర్మపురి క్షేత్రానికి, నియోజక వర్గానికి కోట్లాది నిధులతో చేసిన అభివృద్దిని ఏకరువు పెట్టారు. నాలుగుమార్లు తనను ఇక్కడి ప్రజలు ఆదరించడం వల్లే, తాను చీఫ్ విప్ గా, మంత్రిగా సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు.

అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ప్రజలకు అర్థం అయిందన్నారు. తాను డబ్బులు ఆస్తులు అంతస్తుల కోసం ఎప్పుడూ యోచించ లేదని, తన అధికారాన్ని ప్రజా సంక్షేమం, అభివృధ్ధి కోసమే ఉపయోగించే ఆలోచన చేశా మన్నారు. తనను గెలిపిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల అవసరాల కోసం పోరాటాలు చేస్తామన్నారు.

జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఉమ్మడి కరీంనగర్ డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి ఎంపీపీ చిట్టిబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, పెగడపెల్లి ప్యాక్స్ చైర్మన్ రమణా రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్ కుమార్, మాజీ ఎంపీపీ భీమయ్య, మండల భారాస అద్యక్షులు శేఖర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags