కిడ్నీలు పాడై ఆపదలో ఉన్న కుటుంబానికి సత్య సాయి సేవా సమితి చేయూత.

On
కిడ్నీలు పాడై ఆపదలో ఉన్న కుటుంబానికి సత్య సాయి సేవా సమితి చేయూత.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల మే 16 ( ప్రజా మంటలు )

స్థానిక బుడగ జంగాల కాలానికి చెందిన నూనె తిరుపతి కి రెండు కిడ్నీలు పాడయిపోయాయి, కిడ్నీ మార్పిడి చేయాలనీ డాక్టర్లు చెప్పడం తో తన భార్య తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ప్రభుత్వం నుండి ఆపరేషన్ ఖర్చు సాంక్షన్ అయినప్పటికీ, ఇతర ఖర్చులకు, హైదరాబాద్ హాస్పిటల్ లో 2 నెలలు ఉండవలసి వస్తుంది కాబట్టి దాదాపు ఇంకొక లక్ష రూపాయలపైన తనకు అవసరం వుంది. ఆర్థికంగా ఎటువంటి ఆధారం లేకపోవడంతో వారు సత్యసాయి సంస్థ సహకారాన్ని కోరడం జరిగింది.

భగవానుని అనుగ్రహ ఆశీస్సులతో "శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల" ఆధ్వర్యంలో భక్తులందరి సహకారంతో రూపాయలు 19,100 ను గురువారం వారికి అందచేయడం జరిగింది.

వారికి తక్షణ సహాయంగా ఒక నెలకు కావలసిన బియ్యం తదితర నిత్యావసర వంట సరుకులని అందించడం జరిగింది.

త్వరగా ఆ కుటుంబం కోలుకొని మంచి పరిస్థితులు కలగాలని, వారికీ అలాగే సహకరించిన భక్తులందరికీ సత్యసాయి భగవానుని దివ్య అనుగ్రహ ఆశిస్సులు సంపూర్ణంగా ఉండాలని అందరినీ ఇంట వెంట జంట కంట ఉండి నిత్యం కాపాడాలని మనసారా ప్రార్థిస్తున్నారు.

 కార్యక్రమంలో సంస్థ తరపున కన్వీనర్ బట్టు రాజేందర్ , చిటుమల్ల లక్ష్మీనారాయణ, వూటూరి భాస్కర్ గార్లు పాల్గొన్నారు.

Tags