ఎన్నికల విధులకు మేం సిద్ధం... ఒటేయ్యడానికి మీరు సిద్ధమా....

On
ఎన్నికల విధులకు మేం సిద్ధం... ఒటేయ్యడానికి మీరు సిద్ధమా....

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

 

జగిత్యాల మే 11( ప్రజా మంటలు ) : 

జాతీయ సేవా పథకం జగిత్యాల జిల్లా నోడల్ అధికారి డాక్టర్ పడాల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల జగిత్యాలలో 200 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మే 13, 2024న జరగబోనున్న 18వ లోకసభ ఎన్నికల విధులకు మేం సిద్ధం ఒకటేయ్యడానికి మీరు సిద్ధమా.... సిద్ధం కావాలని ఓటర్లను, యువకులను, వయోవృద్ధులను, విద్యావంతులు, పౌరులను గురించి పేర్కొన్నారు.

 

జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష, ఆర్డీవో పులి మధుసూదన్ గౌడ్ ఆదేశానుసారం జిల్లాలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 200 మంది విద్యార్థులు జిల్లా కేంద్రంలోని వివిధ పోలింగ్ కేంద్రాలలో సేవలందించనున్నారు.

వీరు పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటర్లను క్యూ లైన్ లలో వరుసలో ఉంచడం, ఓటర్లకి నీరు అందించే సదుపాయం, వృద్ధులకి వికలాంగులకి వీల్ చైర్ ద్వారా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లడం, అత్యవసర పరిస్థితుల్లో ప్యారా మెడికల్ సిబ్బందితోపాటు ఎన్నికల సిబ్బందికి మరియు ఓటర్లకు తగిన సహాయం అందించడం వంటి క్రమశిక్షణ పరమైన, సహకార ధోరణితో సేవలు అందిస్తారని, ఎలక్షన్ల విధులలో పాల్గొనడం అంటే దేశ సేవలో పాల్గొన్నట్టేనని జాతీయ సేవా పథకం వాలంటీర్ గా ఉండడం మీ అదృష్టం అని ఈ చక్కటి అవకాశాన్ని దేశ సేవలో వినియోగించి శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సక్రమంగా జరగడంలో మీ వంతు సహకారం అందించాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యాంసాని సత్యనారాయణ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ అంబాల శంకరయ్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

Tags