తెలంగాణ ప్రజల కలలు నెరవేరాలంటే మళ్ళీ బి ఆర్ ఎస్ ను గెలిపించండి - KCR

On
తెలంగాణ ప్రజల కలలు నెరవేరాలంటే మళ్ళీ బి ఆర్ ఎస్ ను గెలిపించండి - KCR

తెలంగాణ ప్రజల కలలు నెరవేరాలంటే మళ్ళీ బి ఆర్ ఎస్ ను గెలిపించండి

కాంగ్రెస్, బిజేపి లు ఇచ్చిన హామీలు గాలిలోనే

గోదావరి నీళ్ళు తమిళనాడుకేనాట?

రైతుబందు లేదు పెన్షన్ ఇవ్వరు

కవులు, రచయితలు, మేధావులు మళ్ళీ ఉద్యమించాలి

జగిత్యాల సభలో కెసిఆర్ ఘర్జన  

జగిత్యాల మే 05 (ప్రజా మంటలు) : పడునాలుగేళ్ల పోరాటంతో తెచ్చుకొన్న తెలంగాణ ప్రజల ఆశయాలను కాపాడుకోవడానికి మళ్ళీ మెరణదారు ఉద్యమం చేయాలని, తెచ్చుకొన్న తెలంగాణ ను కాంగ్రెస్, బిజేపి పార్టీల మోసపు హామేలనుంది, గ్యారంటీల నుండ కాపాడుకోవాలని భారతీయ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాగుతీయాల ప్రజలను కోరారు. ఎన్నికల ప్రహకారంలో భాగంగా జగిత్యాల పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో భాగంగా కెసిఆర్ మాట్లాడుతూ, రాష్టంలో గత ఎన్నికల్లో నలుగురు బిజేపి ఎంపీలు గెలిచినా, ఒకరు మంత్రిగా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి లాభం కూడా జరగలేదని అన్నారు.

గోదావరి నదిలోని నీళ్ళను పూర్తిగా తెలంగాణ రాష్ట్ర పజలకు అండకుండానే, తమిళనాడు కు తీసుకెళ్లాలని బిజేపి ప్రయత్నిస్తుందని, వరాదక అలువలో కాళేశ్వరం ద్వారా నీళ్ళు నింపి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగడానికి మిషన్ భగీరత నీళ్ళు కూడా ఇవ్వలేక పోతుందని కెసిఆర్ అన్నారు.  తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవనే దశలో బిజేపి గత పదేళ్ళలో తెలంగాణకు అన్యాయం చేసిందని, కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తుందని ;అన్నారు. నిర్మల్ సభలో రాజీవ్ గాంధీ మాట్లాడుతూ, పెన్షన్లను 2,500 లు ఇస్తున్నట్లు ప్రకటినచ్చారు మీకు అందుతున్నాయా నై ప్రజలను ప్రశ్నించారు. వారంతా రరాలేదని జవాబిచ్చారు.

జగిత్యాల, కోరుట్ల ప్రాంతంలో బీడీ కారమీకూ ఎక్కువ. వారికి నేను కేంద్రమంత్రిగా ఉన్నపుడు, ఆ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రిగా పెన్షన్, ఇంటి సౌకర్యం కల్పించిన. కానీ బిజేపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు బీడీ ఉత్పత్తిదారులతో కలిసి, కంపనిలను మూసేసే ప్రయత్నం చేస్తున్నాయి. బీడీ తెకఎడారులంతా ఈ విషయాన్ని గ్రహించి, మాతో ఉంటే వారికి మరింత న్యాయం జరిగేట్లు చేస్తామని కెసిఆర్ అన్నారు.

 

అన్నీ వర్గాల వారికి గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్యను అందించామని, పెద పిల్లలు విదేశాలకు వెళ్ళడానికి స్కాలర్షిప్ లు ఇచ్చామని, మతవైషమ్యాలు లేకుండా శాంతియుతమైన తెలంగాణ రాష్ట్రంలో భాతరతీయ రాష్ట్ర సమితి మాత్రమే అభివృద్ధికి కట్టుబడి ఉండనాయి, పారలమనేత లో జమోడికి ఎదురొదడిపోరాడాల్సి వస్తే మనమే పోరాదుతామని, బిజేపి, కాంగ్రెస్ ఆ పని చేయలేవని, బి ఆర్ ఎస్ అభ్యర్థుల విజయం తెలంగాణకి అవసరమని, అందుకే  కరీంనగర్ నుండి బి. వినోద్ కుమార్ , పెద్దపల్లి నుండి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించాలనై కోరారు.

 

ఈ రోజు కాంగ్రెస్, బిజేపి ప్రజలను మోసగించింది.  మీ అందరికి కూడా తెలుసు నరేంద్ర మోడీమీ ఖాతాలలో డబ్బులు వేస్తానన్నాడు. రైతులందరికీ రైతుబంధు పై కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు ఇప్పటికీ ఎప్పుడో రైతుబంధు పడబ్బులు పడాలి. కానీ ఇప్పటీ రాలేదు. కాంగ్రెస్, బిజేపి  మోడీ లదంతా గ్యాస్ పురాణమే తప్ప ఈ దేశంలో ఎవరు కూడా ఏమి కూడా చేయలేదు, చేయరు కూడా అందుకే నేను మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం మీది. భవిష్యత్తు మీది. మీరు, యువకులు ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం చెప్తా ఉన్నా ఈ బిల్డింగ్ మీద నాకు అంత యువ సోదరులు ఏర్పడుతున్నారు ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలి.

 

మన గోదావరి నీళ్లు మనకు దక్కాలి అన్న, మన నిధులు మనకు రావాలన్న, మనకు న్యాయం జరగాలన్న, కచ్చితంగా టిఆర్ఎస్ ఎంపీలే ఉండాలి. మీ అందరికి కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా మీ తెలంగాణ నేను తెచ్చి తెలంగాణ ఎంత బాగా చేస్తున్నావ్ అందరితో నేను కోరుతున్నా, కాంగ్రెస్ మెడలు వంచి, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఆరు గ్యారెంటీలు అమలు చేయించాలంటే టిఆర్ఎస్ పార్టీ గెలవాలి. టిఆర్ఎస్ విజయంలోనే తెలంగాణ విజయం ఉన్నది. కాబట్టి దయచేసి మేధావులు విద్యార్థులు యువకులు అందరు కూడా ఆలోచించి బ్రహ్మాండంగా టిఆర్ఎస్ పార్టీని గెలిపించండని కెసిఆర్ కోరారు.

 

జగిత్యాలలో కవులు రచయితలు, మేధావులు ఉన్నారు – కెసిఆర్

జగిత్యాలలో ఎందరో కవులు, రచయితలు, మేధావులు ఉన్నారు. మీరంతా ఉద్యమించి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం అయ్యారు. జికకద గొప్ప చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య ఉన్నారని గుర్తు చేస్తూ, మళ్ళీ గత వైభవాన్ని తేవడానికి నాతో పాటు మళ్ళీ ఉద్యమించాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని, తెలంగాణకు రావలసిన నిధులు, నీలను కోట్లాది కేంద్రం నుండి తెచ్చుకోవడానికి మళ్ళీ తనతో పాటు ఉద్యమించాలని కె సి ఆర్ విజ్ఞప్తిప చేశారు.