భూ వివాదం లో  మాజీ మంత్రి బియారెస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అరెస్ట్ 

On
భూ వివాదం లో  మాజీ మంత్రి బియారెస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అరెస్ట్ 

భూ వివాదం లో  మాజీ మంత్రి బియారెస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అరెస్ట్ 

హైదారాబాద్ మే 18:

కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం ఉద్రిక్త వాతావరణంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.

 కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లార్రెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్రెడ్డి స్థలంలో ఉన్న వారితో వాగ్వాదానికి దిగారు. అయితే ఆ స్థలం తమదేనంటూ కొందరు వారిద్దరినీ అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

 సమాచారం అందుకున్న స్థానిక పోలీసుల రంగ ప్రవేశం చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

పోలీసులపై మాల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అదుపులో తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు.

సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82 భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు తరువాత పోలీసులు తెలిపారు. అనంతరం మల్లారెడ్డిని పేట్బషీరాబాద్ పోలీస్టేషన్ కు తరలించారు.

Tags