రోడ్డుపై ఓ బాలుడి ప్రాణాలను కాపాడిన మహిళా వైద్యురాలు

On
రోడ్డుపై ఓ బాలుడి ప్రాణాలను కాపాడిన మహిళా వైద్యురాలు

రోడ్డుపై ఓ బాలుడి ప్రాణాలను కాపాడిన మహిళా వైద్యురాలు

విజయవాడ మే 18:

ఓ మహిళా వైద్యురాలు ఓ బాలుడి ప్రాణాలను కాపాడిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది!!!

 విజయవాడలో 6 ఏళ్ల బాలుడు విద్యుదాఘాతంతో స్పృహ కోల్పోగా, అతని గుండె ఆగిపోయిందని భావించారు.

అటుగా వెళ్తున్న ప్రసూతి వైద్యురాలు రవళి.. తండ్రి కొడుకును ఎత్తుకుని రోడ్డుపై పరుగులు తీయడాన్ని గమనించింది.

వెంటనే ఆమె బాలునికి రోడ్డు పక్కన CPR చేసిన ఐదు నిమిషాల తర్వాత, బాలుడు మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు.

బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి, 24 గంటల పరిశీలన తర్వాత బాలుడిని డిశ్చార్జ్ చేశారు.

Tags