గోపన్ పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారం 

On
గోపన్ పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారం 

గోపన్ పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారం 

నిజామాబాద్ మే 04:

నిజాంబాద్ రూరల్ మండలం గోపనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తో కలిసి నిజాంబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి శనివారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు 
టపాసులు పేల్చి, నినాదాలు చేస్తూ జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.

జీవన్ రెడ్డి ని గెలిపిస్తామంటూ నినాదాలు చేశారు.

అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలో గెలిపించాలని జీవన్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీగా గెలిస్తెనే అభివృద్ధి సాధ్యమన్నారు.

జీవన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని ముక్తకంఠంతో నినదించారు.

జీవన్ రెడ్డి స్థానికులతో చేతులు కల్పుతు, ఆప్యాయంగా పలుకరిస్తూ..ఓట్లు అభ్యర్థించారు.

ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ..

నిజాంబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించుకుంటే నే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రతి సంక్షేమ పథకం గడపగడపకు అందిస్తాం.

ఎమ్మెల్యే ఎన్నికల్లో  గోపనపల్లి గ్రామం తనకు అండగా నిలిచిందని, ఎం పీ ఎన్నికల్లో సైతం జీవన్ రెడ్డికి అండగా నిలువాలని కోరారు.

దేశ భవిష్యత్తును నిర్ణయించే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యం అవుతుంది.

దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ , నిజమైన దేశభక్తులు.. దేశ భక్తికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ.

దేశం కోసం మోడీ కుటుంబంలో గానీ, అమిత్ షా మూలంగా ఎవరైనా జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం దేవుడ్ని ముందు పెడుతున్నారని అన్నారు.

రైల్వేలు ప్రైవేట్ పరం చేసిండ్రు.
నిరుపేదల సంపదను బడ వ్యాపార వ్యక్తులకు 15 లక్షల కోట్ల రూపంలో మాఫీ చేసి ప్రజలను మోడీ మోసం చేశారు.

రైతులకు రుణమాఫీ చేసేందుకు మాత్రం మోడీకి మనసు రావడం లేదు.

మోడీకి భార్య పిల్లలు లేరంటూ ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు కుటుంబం ఉన్నవాళ్లు అవినీతిపరులా  చెప్పాలనీ నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ ల్లో ఇప్పటికే ఐదు అమలు చేశాం.

మహాలక్ష్మి పథకం అమలు చేసేందుకు కొంత ఆలస్యం జరుగుతుండడానికి కారణం గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా కాంగ్రెస్ చేతికి అందించింది.

త్వరలోనే కాంగ్రెస్ అన్ని పథకాలు  అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజలు ఆలోచించాలి బిజెపి బీ ఆర్ ఎస్ రెండు ఒక్కటే.

యువకులారా ఆలోచించండి..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఏ  అభివృద్ది  అయినా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలుసుకోవాలన్నారు.

ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో మోడీని చూసి ఓటు ప్రచారం చేస్తున్నారు.

అరవింద్ చూసి ఓటు వేయాలని ఎందుకు అడగడం లేదు.

మోడీని నిజాంబాద్లో ఎంపీ ఎన్నికల్లో నిలబెడితే మద్దతు ఇవ్వడం లో అర్ధం ఉందని అన్నారు.

ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి అభ్యర్థి వ్యక్తిత్వం గురించి ఆలోచించి, పనిచేసే నాయకుడు జీవన్ రెడ్డికి ఓటు వేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి కోరారు.

స్థానిక హనుమాన్ ఆలయం వద్ద  కార్నర్ మీటింగ్ లో ఎం పీ అభ్యర్థి జీవన్ రెడ్డి  మాట్లాడారు.

ఎమ్మెల్యే భూపతిరెడ్డి
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

పదేళ్లుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.

టిఆర్ఎస్ శకం ముగిసింది.

అర్హులైన సంక్షేమ పథకాలు వారిసంక్షేమ వివరాలు సేకరించాలని సుచించారు.

సంక్షేమ పథకాల అమలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించింది కాంగ్రెస్ పార్టీ.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ అందిస్తున్నారా చెప్పాలి.

బిజెపి మోటార్లకు మీటర్లు పెడతాను అంటుంది రైతులకు అండగా నీలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఖరీఫ్ పంట నాటికి రుణ మాఫీ. చేసి కొత్త రుణాలు ఇస్తాం.

గతంలో కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలు మాఫీ చేసింది అని గుర్తు చేశారు.

మతపరంగా రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం లేదు.

రిజర్వేషన్లు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా  అమలు చేయడం జరుగుతుంది.

బిజెపి మతాల మధ్య చిచ్చుపెట్టి, రెచ్చ గొడుతున్నారు.

కాంగ్రెస్ సామాజిక వెనకబాటు ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తే, బిజెపి ఆర్థిక వెనకబాటు ను ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేశారు.

కాంగ్రెస్ ది జాతీయ లౌకికవాధం..బిజెపిది మతతత్వ వాదం..

దేశ ఐక్యత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు కోల్పోయింది..

అందరికీ అందుబాటులో ఉంటా.. అభివృద్ధికి కృషి చేస్తా ఎంపీ ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తాటిపర్తి జీవన్ రెడ్డి కోరారు.

Tags