ఘనంగా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు.

- పాల్గొన్న బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు డా. భోగ శ్రావణి.

On
ఘనంగా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/934842213). 

జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు ) : 

మహాత్మా శ్రీ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాయికల్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా.బోగ శ్రావణి.

ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ....

సంఘసంస్కర్త సమకాలిన సామాజిక రుగ్మతలు కులవివక్ష పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేసి బాలికల విద్య స్త్రీ హక్కులు వితంతు పునర్వివాహానికి కృషిచేసిన బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం సాధికారతకు పరితపించిన సాంఘిక విప్లవకారుడు మహాత్మ శ్రీ జ్యోతిరావు గోవిందరావు పూలే ,వారి భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు.

వారు వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే ఈ సందర్భంగా వారికి నివాళులర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాయికల్ మండల అధ్యక్షులు అన్నవేని వేణు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సురతాని భాగ్యలక్ష్మి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, పట్టణ ప్రధాన కార్యదర్శి బోడుగం శ్రీకాంత్ రెడ్డి,ప్యాక్స్ చైర్మన్ ముత్యం రెడ్డి, కడార్ల శ్రీనివాస్,సామల సతీష్, బన్న సంజీవ్, సింగని సతీష్, మల్లారెడ్డి, పటేల్ రామన్న,తోకల శంకర్, శ్రీ గద్ది సుమన్, అందే శంకర్ రామకృష్ణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags