కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం

On
కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)


ధర్మపురి ఏప్రిల్ 18( ప్రజా మంటలు) : 


ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శేషప్ప కళావేదికపై సంగనభట్ల నరేందర్ శర్మ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం గురువారం రెండో రోజుకు చేరుకుంది.

భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ నామస్మరణతో వేదిక మారుమోగింది.

కార్యక్రమ అనంతరం మంగళహారతి మంత్రపుష్పం భగవన్నా మ స్మరణ నిర్వహించారు.

విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం, జగిత్యాల హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం తోపాటు స్థానికులు భక్తులు పాల్గొన్నారు.

Tags