శివకాశి అగ్ని ప్రమాదం - 10 మంది మరణం

On
శివకాశి అగ్ని ప్రమాదం - 10 మంది మరణం

శివకాశి అగ్ని ప్రమాదం - 10 మంది మరణం

శివకాశి మే 10:  తమిళనాడులోని శివకాశి సమీపంలోని బాణసంచా తయారీ యూనిట్‌లో నిన్న రాత్రి జరిగిన పేలుడులో పది మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు.

విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని బాణసంచా తయారీ యూనిట్‌లో జరిగిన పేలుడులో తొమ్మిది మంది అక్కడే మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఒకరు శిధిలాల కింద పడి మరణించారు. 

ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేస్తూ, క్షతగాత్రులకు తగిన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

Tags