గాంధీనగర్ లో పంచాంగ శ్రవణం

ప్రజలు సుఖశాంతులతో ఉండాలి పురోహితులు -గోపీ శర్మ

On
గాంధీనగర్ లో పంచాంగ శ్రవణం

పాల్గొన్న మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్ పాలకవర్గ సభ్యులు

భీమదేవరపల్లి ఏప్రిల్ 09 (ప్రజామంటలు)

శ్రీ క్రోధి నామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని గాంధీనగర్ గ్రామంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని గ్రామ బస్టాండ్ ఆవరణలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పురోహితులు, ఎంపీటీసీ గోపి శర్మ, మాట్లాడుతూ, ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎంతో పవిత్రమైనదని, ఉగాది రోజు ఆలయంలో కూర్చుని పంచాంగం వింటే శుభమని అన్నారు. క్రోధీ నామ సంవత్సరం ప్రారంభం రోజు తమ రాశిఫలాలు, స్థితిగతులను గురించి తెలుసుకుని అందరూ శాంతులను చేసుకోవడం ద్వారా శుభం అని అన్నారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా పుణ్యాన్ని పొందుతారని అన్నారు. తెలుగు ప్రజలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటని, ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడే అని అన్నారు. తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు.. ఈ ఆరు రుచులతో తయారు చేసే ఈ పచ్చడి వెనుక సంప్రదాయంతో పాటు అంతకుమించి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తులసమ్మ రాజయ్య, మాజీ ఉపసర్పంచ్ అనపురం శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు మాదం సుమన్, గ్రామ పెద్దలు సుధాకర్, లింగయ్య,. ప్రభాకర్ రెడ్డి, సంపత్ రెడ్డి, మొండయ్య గ్రామపంచాయతీ కారోబార్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags