బౌద్ధ నగర్ లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ డే

On
బౌద్ధ నగర్ లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ డే

బౌద్ధ నగర్ లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ డే

సికింద్రాబాద్, ఏప్రిల్ 27 ( ప్రజామంటలు ): 

 బీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ డే సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్ లో కార్పొరేటర్ కంది శైలజ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.  ఈ సందర్భంగా వారాసిగూడ  చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను  ఆవిష్కరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి కార్పొరేటర్ కంది శైలజ వివరించారు. అనంతరం డివిజన్ పరిధిలోని గొల్ల పుల్లయ్య భావి ప్రాంతంలో సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ  బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా  ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఓటర్లను కలుసుకొని అభ్యర్థించారు. కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.
-------
-ఫోటో

Tags