వీరభద్రుని సన్నిధిలో పంచాంగ శ్రవణం

ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటే శుభప్రదం -సీనియర్ పురోహితులు అంజయ్య శాస్త్రి

On
వీరభద్రుని సన్నిధిలో పంచాంగ శ్రవణం

భీమదేవరపల్లి ఏప్రిల్ 09 (ప్రజామంటలు) :

ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎంతో పవిత్రమైనదని, ఉగాది రోజు ఆలయంలో కూర్చుని పంచాంగం వింటే శుభమని సీనియర్ అర్చకులు గుడ్ల అంజయ్య శాస్త్రి అన్నారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఆయన మాట్లాడుతూ, క్రోధీ నామ సంవత్సరం ప్రారంభం రోజు తమ రాశిఫలాలు, స్థితిగతులను గురించి తెలుసుకుని అందరూ శాంతులను చేసుకోవడం ద్వారా శుభం అని అన్నారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా పుణ్యాన్ని పొందుతారని అన్నారు. తెలుగు ప్రజలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటని, ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడే అని అన్నారు. తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు.. ఈ ఆరు రుచులతో తయారు చేసే ఈ పచ్చడి వెనుక సంప్రదాయంతో పాటు అంతకుమించి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ క్రోధి నామ సంవత్సరములో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు రాజయ్య, ముఖ్య అర్చకులు రాంబాబు, సిబ్బంది రవీందర్, సందీప్, శ్రీధర్ గ్రామస్తులు గొదల సంపత్, సింగం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags