ఆదివాసి భూముల రికార్డులు మార్చుకున్న వారిపై చర్యలు తీసుకోండి
తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆరోపణ
ఆదివాసి భూముల రికార్డులు మార్చుకున్న వారిపై చర్యలు తీసుకోండి
లీగల్ నోటీసులు జారీ చేసినా స్పందించని రెవెన్యూ అధికారులు
తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆరోపణ
జగిత్యాల / రాయికల్ ఏప్రిల్ 27: :
అన్యాయంగా గత ప్రభుత్వ, రాజకీయ నాయకుల అండదండలతో ఆదివాసి భూములు కాజేయాలని దొంగ తనంగా భూ మార్పిడి చేసుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు,
తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన బాధితులను కలిసిన అనంతరం జగిత్యాలలో విలేఖరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో స్థానిక ఎమ్మెల్యే అండదండలతో మండల స్థాయి నాయకుని ఆధ్వర్యంలో రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో 176 సర్వే నంబర్ యందు జాడి భీమయ్య ( ఆదివాసీ ) భూమిని (7.13 ఎకరాలు ) అదే గ్రామానికి చెందిన గుడిగిల్లా సత్తయ్య అక్రమంగా రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని భూ మార్పిడి చేసుకున్నాడు అని ఆరోపించారు.
2018 లో ధరణి యందు ఇట్టి భూమిని తన పేరున నమోదు చేయించు కున్నారని అన్నారు. అట్టి విషయం తెలిసి బాధితులు తుడుం దెబ్బ నాయకుల సహాయంతో మండల స్థాయి నుండి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు పోరాటం చేసినా లాభం లేక పోయిందన్నారు. ఇప్పటి ప్రభుత్వం అయినా అట్టి అక్రమార్కులని చట్టపరంగా కఠినంగా శిక్షించి సంబందింత ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారు. ఇట్టి విషయంపై లీగల్ గా అడ్వకేట్ కిరణ్ కుమార్ చెక్రపాటితో నోటీసులు కూడ పంపడం జరిగిందన్నారు. అయినా ఇక్కడి అధికారుల్లో ఎలాంటి చలనం రావడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మా అదివాసిలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో హై కోర్టు ను ఆశ్రయిస్తామని గుర్రాల రవీందర్ హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా కొనసాగుతున్న అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?.

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్
