పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

అలనాటి జ్ఞాపకాలు నెమరువేస్తూ గురువులకు సన్మానం

On
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

1995-2005 దశాబ్ది విద్యార్థుల మహోత్సవం

భీమదేవరపల్లి, (ప్రజామంటలు), ఏప్రిల్ 07

భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో శ్రీ సరస్వతి శిశుమందిర్ లో 1995 నుంచి 2005 తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు 20 ఏళ్ల తరువాత అదే పాఠశాలలో మళ్లీ కలుసుకున్నారు. 49మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాఠశాల నాటి ప్రధానోపాధ్యాయులు హాజరై జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ముందుగా తన తోటి చదువుకున్న విద్యార్తులు అకాల మృతి చెందిన వారికి నివాళులర్పించారు.అప్పటి మధుర జ్ఞాపకాలతో ఉల్లాసంగా గడిపారు. అప్పటి గురువులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గురువులు గొల్లపల్లి లక్ష్మయ్య, రాజిరెడ్డి గుడికందుల సుదర్శన్, బత్తిని మోహన్, మాడిశెట్టి శ్రీకాంత్, బత్తిని రాంబాబు, మార్పాక శ్రీనివాస్, హైమా, జమున, జయంతి, పావని, విద్యార్థులు ఉడుత శ్రీనాథ్ , చిట్కూరి రంజిత్ ,గన్ను వినిల్ సుతార్ సతీష్,చిట్కూరి శ్రీనివాస్, తౌటం రాజేష్, గట్టు సురేష్, పిల్లల శ్రీధర్, లవన్ ,కిరణ్ , బొల్లంపల్లి రాజు, మార్పాటి ప్రవీణ్ రెడ్డి, తాళ్ల చరణ్, శ్రవణ్, భవ్య లావణ్య, బిందు, శ్రీహర్షిని, శ్రావణి అనంతలక్ష్మి, స్రవంతి , ప్రవళిక జానకిరాణి పాల్గొన్నారు.

 

*20 సంవత్సరాల తర్వాత...*

20 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు గుర్తు పెట్టుకొని గురువులను సన్మానించడం సంతోషంగా ఉంది. శిశు మందిరాలో విద్యార్థులకు బోధించాను. ఉపాధ్యాయ వృత్తి నాకు సంతృప్తినిచ్చింది. మేము బోధించిన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది.

 -ఊపాధ్యాయులు బల్లు రమేష్*

*బాల్య స్నేహితులను కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం*

ఇన్నాళ్లకు బాల్యమిత్రులను కలుసు కునే అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా మాట్లాడుకున్నాం. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాం 

-లావణ్య 

*బాల్యంలోకి వెళ్లినట్టు అనిపించింది*

చిన్ననాటి మిత్రులందరినీ కలిసి ఈ రోజు ఇలా పాల్గొనడంతో తిరిగి బాల్యంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. ఈ టైంలో బడి జ్ఞాపకాలను గుర్తుచేసి మనస్సుకు హాయి నింపడం ఆనందంగా ఉంది. అప్పటి మా గురువులను కలుసుకున్నాం.

- రంజిత్ 

*మిత్రులకు అందుబాటులో ఉంటా*

చాలా రోజుల తర్వాత మిత్రులను కలిసిపోవడం చాలా ఆనందంగా ఉంది. మిత్రులకు అందుబాటులో ఉంటా. చాలా రోజుల తర్వాత గురువులను సన్మానించు కోవడం సంతోషాన్ని ఇచ్చింది.

-శ్రీనాథ్

Tags