29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ - పోలీస్ బలగాల ఏకపక్ష దాడి
29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ - పోలీస్ బలగాల ఏకపక్ష దాడి
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ - నారాయణపూర్ సరిహద్దు ఎన్‌కౌంటర్ పై సిడిఆర్వో సంచలన ప్రకటన
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 27:
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ - నారాయణపూర్ సరిహద్దు దగ్గర
ఏప్రిల్ 16వ తేదీన భద్రతా బలగాలు 29 మంది మావోయిస్టులను చంపేసాయని
ప్రజా స్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ
( కో - ఆర్డినేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ - CDRO ) ఆరోపించింది.
మావోయిస్టుల ఉద్యమాన్ని అంతం చేయడానికి బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలని సిడిఆర్ వో సూచించింది.
ప్రభుత్వ సంస్థలు ఈ మావోయిస్టుల హత్యను ఎన్‌కౌంటర్‌గా పేర్కొన్నప్పటికీ, భద్రతా దళాలకు ఎటువంటి నష్టం లేదా తీవ్రమైన గాయాలు కూడా లేకపోవడం, మరోవైపు 29 మంది మరణించడం చూస్తే ఇది ఏకపక్ష దాడి అని ఎవరికైనా అనుమానం కలుగుతుందన్నారు. సిడి ఆర్ వో సంస్థ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
2017 తరువాత జరిగిన అతిపెద్ద ‘నక్సల్ వ్యతిరేక చర్య’ గురించి ప్రధాన స్రవంతి మీడియాలో వచ్చిన నివేదికలు ఈ హత్యలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఇది ఎన్కౌంటర్ కాదని నిస్సందేహంగా నిరూపించాయని సిడీఆర్ ఓ పేర్కొంది. మృతుల్లో 15 మందికి పైగా మహిళలు ఉన్నారని వివిధ మీడియా పేర్కొందన్నారు. వీరిలో చాలా మంది గ్రామాల్లో నివసిస్తున్న మావోయిస్టుల కేడర్ అని, మావోయిస్టులకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తూండవచ్చని పోలీసులు అంటున్నారు అయితే, నిరుపేద ఆదివాసీ మహిళలు భద్రతా బలగాల అకృత్యాలకు పదే పదే గురికావడాన్ని గతంలో చూసాం. ఉదాహరణకు, ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన 8 గంటలపాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో ఒకరు కమ్లీ కుంజమ్. కమ్లీకి చెవుడు వుందని, సరిగ్గా మాట్లాడలేదని ఆమె తల్లి సోమ్లీ చెబ్తున్నారు. ఆమె మాటల్లో, “నా కుమార్తె వినలేదు; ఆమె చెవిటిది. ఆమె సరిగ్గా మాట్లాడలేదు కూడా. మావోయిస్టులకు ఎలా సహాయం చేస్తుంది?.”
మావోయిస్టులు, ప్రభుత్వ భద్రతా బలగాల మధ్య దీర్ఘకాలంగా జరుగుతున్న ఘర్షణ బస్తర్‌లోని ఆదివాసీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను గణనీయంగా ప్రభావితం చేసింది. ఆదివాసీ మహిళలపై క్రూరమైన లైంగిక, శారీరక హింసకు భద్రతా బలగాలు పాల్పడ్డాయని అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి:, రాజ్య పోలీసు సిబ్బందిపైన 16 మంది మహిళలపై అత్యాచారం, లైంగిక, శారీరక వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమని 2017లో జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తించింది.
బీజాపూర్ జిల్లాలోని తన ఇంట్లోనే భద్రతా బలగాలు తనపై అత్యాచారం చేశాయని 2018లో 23 ఏళ్ల ఆదివాసీ మహిళ చెప్పింది. ఈ ఏడాది 6 నెలల పసికందు తుపాకీ గుండు తగిలి చనిపోయింది. మావోయిస్టులు ఆ శిశువుని హత్య చేశారని పోలీసులు అంటూంటే, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న వారిపై పోలీసులు ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అన్నీ మావోయిస్టులను శాంతిభద్రతల సమస్యగా చూస్తూ, గతంలో ఆపరేషన్ గ్రీన్‌హంట్ వంటి విభిన్న ప్రయత్నాల ద్వారా మావోయిస్టులను నిర్మూలించడానికి ప్రయత్నించాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ సమాధాన్-ప్రహార్‌ను ప్రారంభించింది.
ప్రస్తుత ఆపరేషన్ కగార్‌ను ఆపరేషన్‌ను సమాధాన్ - ప్రహార్‌కు పొడిగింపుగానే చూడాలి. 2023 డిసెంబరులో ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భద్రతా దళాల చర్యలు తీవ్రతరమయ్యాయి - 2024లో, పోలీసు నివేదికల ప్రకారం, 79 మంది మావోయిస్టులు మరణించారు, ఈ సంఖ్య 2023లో కంటే మూడు రెట్లు ఎక్కువ.
క్రోనీ క్యాపిటలిస్టుల, వారి సామ్రాజ్యవాద భాగస్వాముల పరిశ్రమల స్థాపనకు ఖనిజాలు అధికంగా ఉన్న అటవీ భూమిని లాక్కోవడానికి వీలుగా చట్టాలలో తీసుకువచ్చిన మార్పులతో పాటు ఈ సైనిక చర్యలను చూడాలి. "అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, 2023"ను పార్లమెంటులో సులభంగా ఆమోదించడం లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలను కల్పించే షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయితీల విస్తరణ (పెసా) చట్టం-1996 అమలు కాకపోవడం, ముఖ్యంగా సహజ వనరుల నిర్వహణ, సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాల మెరుగుదల పట్ల ప్రభుత్వానికి సుముఖత లేకపోవడాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మావోయిస్టులు సమాజంలోని అణగారిన వర్గాల తరపున సామాజిక కారణాలపై పోరాడుతూనే ఉన్నారు. పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనపై ప్రభుత్వ ఉద్దేశాల పట్ల సందేహాలను లేవనెత్తుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ప్రజలను, ముఖ్యంగా పేద ఆదివాసీలని గురించి పట్టించుకోవడం లేదని ఇది చూపిస్తుంది.
ప్రభుత్వ సైనిక చర్యలు పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయి. పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలు ప్రభుత్వాలను తమ పౌరులపై యుద్ధం చేయకుండా నిరోధిస్తాయి,
సాయుధ ప్రతిఘటనతో సహా తమ ప్రాణాలను, భద్రతను అన్ని విధాలుగా రక్షించుకునే హక్కును ఈ ఒప్పందాలు తిరుగుబాటుదారులకు ఇస్తాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని సర్కేగూడ, కొత్తగూడ, రాజ్‌పెంట గ్రామాల్లో 2012లో ఎన్‌కౌంటర్ పేరుతో 17 మంది ఆదివాసీలను హత్య చేసిన ఘటనను సిడిఆర్‌ఓ నిజనిర్ధారణ బృందం వెలుగులోకి తెచ్చింది.
ఆ తరువాత మా బృందం పరిశోధనలను మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వికె అగర్వాల్ నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఫలితాలు సమర్థించాయి. అలాగే, 2023లో, ఆదివాసీ గ్రామాలపై ప్రభుత్వం జరిపిన ఇంతకు ముందెన్నడూ ఎరుగని వైమానిక బాంబు దాడులు, పోలీసు క్యాంపుల ఏర్పాటు వ్యతిరేక ఉద్యమాలపై రాజ్య అణచివేత పైన, రోడ్ల నిర్మాణం కోసం జరిగిన అక్రమ, బలవంతపు భూ సేకరణకు సంబంధించి అనేక ఉదంతాలను, విషయాలను డాక్యుమెంట్ చేసాం.
పేద ఆదివాసీలకు వ్యతిరేకంగా ప్రస్తుతమూ, గతంలోనూ సైనిక, సాయుధ బలగాలతో సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మావోయిస్టు సమస్య సామాజిక రాజకీయ సమస్య అని, సైనిక పరిష్కారాల ద్వారా కాకుండా రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని దృఢంగా భావిస్తున్నాం. ఆపరేషన్ గ్రీన్‌హంట్, సమాధాన్-ప్రహార్ లేదా కగార్ లాంటి సైనిక పరిష్కారం ద్వారా కొంతమంది మావోయిస్టులను చంపగలరేమో కానీ మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఉద్యమాన్ని అంతం చేయడానికి బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలి.
సిడిఆర్ వో డిమాండ్లు:
సామాజిక-ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం సాయుధ బలగాలను ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాం;
సాయుధ బలగాలను వెంటనే బ్యారక్‌లకు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
మావోయిస్టులను నియంత్రించే పేరుతో ఆదివాసీల ఎన్‌కౌంటర్ హత్యలు, ఆదివాసీ మహిళల వేధింపులను ఆపివేయాలి.
బలగాల కార్యనిర్వహణ పద్ధతిపై దృష్టి సారించేందుకు కాలపరిమితితో కూడిన ఉన్నత స్థాయి న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
మావోయిస్టు సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం షరతులు లేని సంభాషణను ప్రారంభించాలి: పెసా, ఎఫ్‌ఆర్‌ఏ చట్టాలను వాస్తవికంగా అమలు చేయడం ప్రారంభించాలి; అభివృద్ధి పేరుతో కార్పొరేట్ దోపిడీకోసం అటవీ, ఆదివాసీల భూముల సేకరణను ఆపాలి.
సిడిఆర్‌ఓ సమన్వయకర్తలు :
(ఆశిష్ గుప్తా)
(తపస్ చక్రవర్తి)
(క్రాంతి చైతన్య)
సిడిఆర్‌ఓ భాగస్వామ్య సంస్థలు:
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (పంజాబ్);
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (, హర్యానా),
అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (పశ్చిమ బెంగాల్);
అసన్‌సోల్ సివిల్ రైట్స్ అసోసియేషన్ (పశ్చిమ బెంగాల్);
బందీ ముక్తి కమిటీ (పశ్చిమ బెంగాల్);
పౌర హక్కుల సంఘం (ఆంధ్రప్రదేశ్);
పౌర హక్కుల సంఘం (తెలంగాణ);
కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (మహారాష్ట్ర);
కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (తమిళనాడు);
కో-ఆర్డినేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్(మణిపూర్);
మానబ్ అధికార్ సంగ్రామ్ సమితి (అస్సాం);
నాగా పీపుల్స్ మూవ్‌మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్;
మానవ హక్కుల కోసం పీపుల్స్ కమిటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (జమ్మూ మరియు కాశ్మీర్);
పీపుల్స్ డెమోక్రటిక్ ఫోరమ్ (కర్ణాటక);
జార్ఖండ్ కౌన్సిల్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (జార్ఖండ్);
పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఢిల్లీ);
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ రైట్స్ (హర్యానా),
కాంపెయిన్ ఫర్ పీస్ & డెమాక్రసీ ఇన్ మణిపూర్, ఢిల్లీ;
జానకీయ మనుష్యావకాశ ప్రస్థానం, కేరళ
More News...
<%- node_title %>
<%- node_title %>
కిసాన్ గ్రామీణ మేళలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు జిల్లా కురుమ సంఘం ఘన సన్మానం
కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను జిల్లా కురుమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి ఆయిలన్న కురుమ ఆధ్వర్యంలో దత్తాత్రేయకు మెమొంటో... ప్రజాపాలనలో రిటైర్డ్ ఉద్యోగుల దుస్థితి దుర్భరం రిటైర్డ్ బెనిఫిట్స్ ని ఏక కాలంలో చెల్లించాలి. జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు.
రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫెర్ అసోసియేషన్, జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2024 ఏప్రిల్ నుండి రిటైర్డ్ అయినా ఉద్యోగుల... విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం....
జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)
జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేసి మారణ హోమం సృష్టిస్తున్నారని దాని నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు. స్థానిక తహశీల్ చౌరస్తాలోనిరసన ధర్నా చేపట్టిబంగ్లాదేశ్ ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు
ఈసందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు... నవ్య బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు
జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)నవ్య బాలికల జూనియర్ కళాశాల జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు ఏర్పాటుచేసిన వీడ్కోలు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ హాజరై ఎలాంటి లాభాపేక్ష లేకుండా అమ్మాయిల కోసం ప్రత్యేక కళాశాల నెలకొల్పి అతికొద్ది కాలంలోనే రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తూ,... అమృత్ 2.O పథకం లోని పనులను వేగవంతం చేయాలి _అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
కోరుట్ల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)
మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్న దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 పథకం క్రింద నిధులు మంజూరు చేయగా ఈ పథకం కింద వాటర్ ట్యాంక్‌లు, వాటర్ సంప్, పైప్ లైన్లు నిర్మిస్తున్నారు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పనులు కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం... తాడిచెల్లి నూతన సర్పంచ్ రామిడి రాజిరెడ్డికి ఘన సత్కారం
రం
కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం తాడిచెల్లి గ్రామానికి నూతన సర్పంచ్‌గా ఎన్నికైన సీనియర్ కాంగ్రెస్ నేత, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామిడి రాజిరెడ్డిని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్... ట్రిపుల్ ఆర్, భూసేకరణ, రైతు–చేనేత సమస్యలపై జాగృతి పోరాటం – భువనగిరిలో కవిత సంచలన వ్యాఖ్యలు
భువనగిరి డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా భువనగిరి జిల్లాలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రెస్మీట్లో విస్తృత అంశాలపై స్పందించారు. తాను తెలంగాణ ప్రజల బాణమని, ఎవరో ఆపరేట్ చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో బరిలో ఉంటామని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు... పంచాయతీలకు నెలలో నిధులు విడుదల చేయాలి – లేదంటే హైదరాబాద్‌లో సర్పంచుల పరేడ్: బండి సంజయ్
కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
తెలంగాణ గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నెల రోజుల్లోగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డెడ్‌లైన్ విధిస్తూ, లేకపోతే హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్రవ్యాప్త సర్పంచులు, ఉప సర్పంచులతో భారీ “పరేడ్” నిర్వహిస్తామని హెచ్చరించారు. గ్రామాలకు నిధులు... పొలాస వ్యవసాయ కళాశాలలో విద్యార్థులతో మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా. సంజయ్ ముఖాముఖి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పొలాస వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జానయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య,... ఇటిక్యాల గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలి – జీవన్‌రెడ్డి
జగిత్యాల రూరల్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
ఇందిరా భవన్లో ఇటిక్యాల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయడం ఇటిక్యాల... అంగరంగ వైభవంగా కలియుగ దైవం కల్యాణ వేడుకలు
జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో గల శ్రీ శ్రీనివాసాంజనేయ భవాని శంకర దేవాలయంలో శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ వేడుకలు మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణాన్ని కొనసాగించారు భక్తులు... 