కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి సస్పెన్స్ సస్పెన్స్

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్

On
కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి సస్పెన్స్ సస్పెన్స్

కార్యకర్తలలో తీవ్ర అయోమయం

భీమదేవరపల్లి ఏప్రిల్ 21 (ప్రజామంటలు) :

కరీంనగర్ లోక్ సభ స్థానానికి తమ అభ్యర్థిగా అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డిని ప్రకటించినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్ పేరు మీద లెటర్ హెడ్ విస్తృతంగా మీడియాలో ప్రచారమవుతుంది. అదేవిధంగా వేలిచాల రాజేందర్ రావు పేరుతో కూడా ఒక లెటర్ హెడ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. శనివారం సాయంత్రం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖలు కార్యకర్తలలో తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నాయి.ఈ రెండు ఫేక్ న్యూస్ అయినప్పటికీ సాధారణ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. వాస్తవానికి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిని అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు.

Tags