గుడుంబా కేసులో మహిళకు 50 వేల జరిమానా

ముల్కనూర్ వడ్డెర కాలనీకి చెందిన మహిళా - కాజీపేట సిఐ చంద్రమోహన్

On

ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు

భీమదేవరపల్లి ప్రజా మంటలు ఏప్రిల్ 04

గుడుంబా కేసులో 50వేల జరిమానా.................... ముల్కనూరు వడ్డెర కాలనీకి చెందినటువంటి ఒక మహిళ కు గుడుంబా అమ్ముతున్న కారణంగా 50 వేల రూపాయలు జరిమానా విధించినట్టు కాజీపేట సిఐ చంద్రమోహన్ తెలిపారు. వివరాల్లోకి వెళితే ముల్కనూర్ వడ్డెర కాలనీకి చెందినటువంటి గొల్లెన రజిత అనే మహిళ గతంలో గుడుంబా కేసులో పట్టుబడి స్థానిక భీమదేవరపల్లి ఎమ్మార్వో ఎదుట బైండోవర్ ఐ నేను ఇకనుంచి గుడుంబా అమ్మకాలు చేయను చేసినట్లయితే నాకు జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించవలసిందిగా స్వయంగా ఎమ్మార్వో ఎదుట బైండోవర్ కావడం జరిగింది. అయితే బైండోవర్ అయిన తర్వాత కొంతకాలానికి తిరిగి అట్టి మహిళ స్థానిక ఎక్సైజ్ అధికారులకు గుడుంబా అమ్ముకుంటూ దొరకడం జరిగింది, అలా దొరకడం వల్ల ఆమెను పరకాల సబ్ జైలుకు రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత తిరిగి breach కేస్ నమోదు చేసి స్థానిక ఎమ్మార్వో ప్రవీణ్ ఎదుట హాజరు పరచగా ఆమెకు 50 వేల రూపాయల జరిమానా విధించినట్లు, అట్టి 50వేల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు జమ చేయించినట్లు ఎక్సైజ్ ci చంద్రమోహన్ తెలిపారు. అయితే సీఐ మాట్లాడుతూ ముల్కనూరు వడ్డెర కాలనీలో ఇంకా కొంతమంది ఎక్సైజ్ అధికారుల కన్ను కప్పి గుడుంబా విక్రయాలు కొనసాగిస్తున్నారని వారికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా గుడుంబా అమ్మకాలు తయారు చేసుకోవడం మానుకోవాలని లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో ఎస్సై మమత హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ ,కోటి పాల్గొన్నారు.

Tags