వడగండ్ల బీభత్సం - ఆగమైన అన్నదాతలు

కర్షకులకు కడగండ్లు మిగిల్చిన వడగండ్లు

On
వడగండ్ల బీభత్సం - ఆగమైన అన్నదాతలు

నేల రాలిన ఇండ్లు, మామిడి తోటలు

*ముత్తారంను ముంచెత్తిన వడగండ్లు*

 

కర్షకులకు కడగండ్లు మిగిల్చిన వడగండ్లు

 

ఇండ్లు నేలమట్టం 

 

నేలరాలిన మామిడి తోట 

 

ఈదురు గాలులకు కొట్టుకుపోయిన షెడ్లు 

 

భీమదేవరపల్లి మే 05 (ప్రజామంటలు) :

 

మండలంలోని ముత్తారం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షం అన్నదాతలను మరోసారి అతలాకుతలం చేశాయి. కర్షకులకు కడగండ్లనే మిగిల్చింది. చేతికి వచ్చిన మామిడి తోట ఈదురు గాలులతో వర్షార్పనమైనది. ముత్తారం గ్రామానికి వడ్డేపల్లి నరసయ్య కు చెందిన మూడు ఎకరాల మామిడి తోట మొత్తం నేలమట్టమైనది. వడగండ్ల వానతో పంట సర్వం నష్టపోయి అన్నదాతలు దిక్కుదోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అనేకచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు నేల మట్టమయ్యాయి. కల్లాలలో ఉన్న ధాన్యం తడిసి ముద్దయి ఎందుకు కాకుండా పోయింది. హవల్దార్ పల్లికి చెందిన కత్తుల కుమారస్వామి ఇల్లు ఈదురు గాలులతో పూర్తిగా నేలమట్టమైనది. ఏనుగు ముత్యంరెడ్డికి చెందిన పశువుల కొట్టం పూర్తిగా ఈదురు గాలులకు కొట్టుకుపోయినది. ఇంకా చాలామంది రైతులు మామిడి తోటలు పూర్తిగా రాలి పోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని అందించాలని వారు కోరుతున్నారు.

Tags