చిన్న హనుమాన్ జయంతి కి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి..

- భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్.

On

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

మల్యాల ఏప్రిల్ 10 ( ప్రజా మంటలు)

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు లో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఆలయ పరిసరాల్లో, మాలవిరమణ, క్యూలైన్లలో, వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఎస్పీ వెంట డిఎస్పి రఘు చందర్, మల్యాల సి.ఐ రవి, ఎస్.ఐ రహీం ఉన్నారు.

Tags