ఘనంగా ఈశ్వరమ్మ డే ఉత్సవాలు.

On
ఘనంగా ఈశ్వరమ్మ డే ఉత్సవాలు.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349383/9348422113)

జగిత్యాల మే 6( ప్రజా మంటలు )

*భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మాతృమూర్తి అయిన "ఈశ్వరమ్మ" వర్ధంతి(మే 6 వ తేది) ని* పురస్కరించుకొని సాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో *భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ఆధ్వర్యంలో* సోమవారం నాడు ఉదయం 5.00 గంటలకు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన* 160 మంది పేద నారాయణులకు "చెప్పుల పంపిణీ , పులిహోర మరియు స్వీట్ ప్రసాద పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు"*

బస్టాండ్ లోని చలివేంద్రం వద్ద "మజ్జిగ పంపిణీ" చేశారు.

మండుటెండలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి "తలటోపీల (కాప్స్) పంపిణీ" చేశారు.అలాగే సాయంత్రం 6.15 గంటలకు ప్రత్యేక భజన.

సమ్మర్ క్యాంపు లో డ్రాయింగ్ కాంపిటీషన్, క్విజ్ , ఉపన్యాస మరియు తదితర పోటీలలో గెలిచిన బాలవికాస్ పిల్లలకు బహుమతుల అందచేత.

సాయంత్రం 7.00 గంటలకు "మాతృ పూజ(మాతృ వందనం)" లో భాగంగా "మాతృ మూర్తులకు వారి పిల్లలచే పాదపూజ కార్యక్రమం", తదనంతరం స్వామి వారికి హారతి మరియు అల్పాహార ప్రసాదం* ఉంటుందని తెలపడం జరిగింది.

అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్న మరియు సహకరిస్తున్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

*ఇట్టి కార్యక్రమాలలో సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్, చిటుమల్ల లక్ష్మీనారాయణ, కోటగిరి మహేందర్, తాటిపర్తి దశరథ రెడ్డి, రాచకొండ విద్యాధర్, వంగల లక్ష్మీనారాయణ, మామిడాల చంద్రయ్య, ఠాకూర్ నారాయణ్ సింగ్, జిల్లా సుధాకర్, మరియు మహిళా సభ్యులు చిటుమల్ల జయశ్రీ , బట్టు శ్రీలత , గుండ అర్చన , అర్వపేల్లి వీణ , బట్టు పద్మ , జైశెట్టి విజయ , వూటూరి భాగ్యలక్ష్మి , కోటగిరి అరుణ , సామ రజిత , సుపద , అరుణశ్రీ , వందన , లక్ష్మి, సులోచన తదితరులు పాల్గొన్నారు.*

Tags