భావితరాలకు స్ఫూర్తిదాయకం అంబేద్కర్ జీవితం - అదనపు ఎస్పీ వినోద్ కుమార్

On
భావితరాలకు స్ఫూర్తిదాయకం అంబేద్కర్ జీవితం - అదనపు ఎస్పీ వినోద్ కుమార్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 14 (ప్రజా మంటలు)

 భావి తరాలకు అంబేద్కర్ జీవితం ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా అదనపు ఎస్పీ అన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత దేశానికి అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించి ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు.

డా.అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా అందరూ నడుచుకోవాలని,ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ వేణు, ఆర్ ఎస్ఐ లు కృష్ణ, మల్లేష్, మనీష్, వినోద్ రెడ్డి, ప్రణీత్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags