ఘనంగా రంజాన్ వేడుకలు

కొత్తకొండ రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎస్ఐ సాయిబాబు

On
ఘనంగా రంజాన్ వేడుకలు

ప్రజలకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు

ముల్కనూర్ లో ......

భీమదేవరపల్లి ఏప్రిల్ 11 (ప్రజా మంటలు) ;

 

ముల్కనూర్ పట్టణంలోని మసీదు వద్ద రంజాన్ వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఇందులో భాగంగా మసీదు వద్ద పండ్లు పంచడం జరిగినది. ఈ కార్యక్రమంలో నవాబ్ పాష. సయ్యద్ బాబా, చాంద్ పాషా, నవాజ్, సాజిద్, సోహెల్, షరీఫ్, పాల్గొన్నారు.

కొత్తకొండలో......

ఈ సందర్భంగా కొత్తకొండలో నిర్వహించిన రంజాన్ వేడుకలలో ముల్కనూర్ ఎస్సై సాయిబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాషా యదుల్, శుక్రు పాషా, యూసుఫ్, జహంగీర్, కాజా, జావీద్, షాబుద్దీన్,  మెహబూబ్, తాహెర్, అజీమ్, ఆరిఫ్, అఫ్రోజ్, సద్దాం, సజీద్, అభిదు, దాదా సాహెబ్, ఫక్రోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Tags